లవర్‌ బాయ్‌గా సూపర్‌ హిట్లు...

Submitted by ganesh on Sat, 11/03/2018 - 19:00
లవర్‌ బాయ్‌గా సూపర్‌ హిట్లు...

                    టాలీవుడ్ లో శైలజా రెడ్డి అల్లుడు తర్వాత నాగచైతన్య హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన మూవి సవ్యసాచి.లవర్‌ బాయ్‌గా సూపర్‌ హిట్లు సాధించిన చైతు  యాక్షన్‌ హీరోగా మాత్రం ప్రతీ సారి ఫెయిల్‌ అయ్యాడు. అయినా మరోసారి అదే జానర్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.  మరి రిసెంట్ గా రిలీజ్ అయినా సవ్యసాచి కామన్ ఆడియాన్స్ కి ఎంత వరకు కనక్ట్ అయింది?.చందు మొండేటి సరికొత్త ప్రయోగం ఎంత వరకు సక్సస్ అయింది?.టోటల్ గా ఈ సినిమా పై వినిపిస్తున్న టాక్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

                     టాలీవుడ్ లో శైలజారెడ్డి అల్లుడు సినిమా తర్వాత నాగ చైతన్య నటించిన మరో మూవి సవ్యసాచి. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్లితే విక్రమ్ ఆదిత్య  వానిషింగ్ ట్వీన్ సిండ్రోమ్  అనే అరుదైన వ్యాధితో బాధపడే యువకుడు. ఆనందంలో, ఆందోళన సమయంలో  వ్యాధి కారణంగా తన రెండో చేయి తీవ్రంగా స్పందిస్తుంటుంది. చిత్ర అనే కాలేజ్ మేట్‌తో ప్రేమలో పడుతాడు. ఓ కారణంగా ఆరేళ్లు ఆమెకు దూరమవుతాడు. తనకు ఇష్టమైన అక్కకూతురు, బావ ఓ ప్రమాదంలో చనిపోతారు.దానికి  ఓ వ్యక్తి కారణం అని తెలుసుకుంటాడు.అతని భారి నుండి ఆ కుట్టుంభన్ని ఎలా కపాడాడు.  తన ప్రేయసి చిత్రకు విక్రమ్ ఆరేళ్లు ఎందుకు దూరమయ్యాడు? మాధవన్ దుశ్చర్యలను ఎలా అడ్డుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే సవ్యసాచి సినిమా.

                     పెర్ఫార్మెన్స్‌ పరంగా చైతూ విషయానికి వస్తే సన్నివేశాల్లో బలం లేకపోవడంతో పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ లేకుండపోయింది. అయితే పాత్ర పరిధి మేరకు చైతూ వందశాతం న్యాయం చేశాడనే చెప్పవచ్చు. ఇక నిధి అగర్వాల్ విషయానికి వస్తే తెరపై అందంగా కనిపించింది. చైతు పక్కన ఫ్రెష్‌గా, గ్లామరస్‌గా మెరిసింది. యాక్టింగ్ పరంగా తన ప్రతిభను మెరుగు పరుచుకొంటే టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు తలుపుతట్టే ఛాన్స్ ఉంది.ఇక మాధవన్ విషయానికి వస్తే కీలక సన్నివేశాల్లో ఆయన పలికించిన హావభావాలు మూవీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. మాధవన్ పాత్రను ఫస్టాఫ్‌లో కొంత ప్లాన్ చేసి ఉంటే సినిమా వేగం మరింత పెరిగేది. ప్రీ క్లైమాక్స్ వరకు కథను సాగదీయడం వల్ల మాధవన్ క్యారెక్టర్‌ పూర్తిస్థాయిలో ఎలివేట్ కాలేకపోయింది.

                       దర్శకుడు చందు మొండేటి ఎత్తుకొన్న పాయింట్ సరికొత్తగా ఉన్నప్పటికీ.. కథ, కథనాలను బలంగా చెప్పడంలో తడబాటు స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌ స్క్రీన్ ప్లే ప్రయత్నం బెడిసి కొట్టిందనే చెప్పాలి. కథ అంతా సెకండాఫ్‌లో కాకుండా ఫస్టాఫ్‌లో కొంత కొంత రివీల్ చేసి ఉంటే సినిమాపై మరింత ఆసక్తిపెరిగేది. మాధవన్ క్యారెక్టర్‌ను ఇండోర్‌కు పరిమితం చేయడం వల్ల స్క్రీన్ ప్లేలో పదును తగ్గిందని చెప్పవచ్చు. తొలిభాగంలో బలమైన సన్నివేశాలు లేకపోవడం సినిమాకు ప్రతికూలమైన అంశంగా మారింది.మొత్తనికి మల్టీప్లెక్స్ ఆడియెన్స్, ఏ సెంటర్ ప్రేక్షకులకు నచ్చే విధంగా సవ్యసాచి ఉంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయితే మైత్రీ మూవీ మేకర్స్ ఖాతాలో మరో విజయం చేరినట్టే.

Naga Chaitanya
Naga Chaitanya News
Naga Chaitanya updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Lover Boy Super Hit

YOU MAY LIKE