మాస్ సినిమాల రీసౌండ్ మోతమోగిపోతుందా..?

Submitted by ganesh on Tue, 12/04/2018 - 17:50
మాస్ సినిమాల రీసౌండ్ మోతమోగిపోతుందా..?

                      టాలీవుడ్ లో మాస్ హీరోల ఆడ్రస్ గల్లతయ్యింది. ఇదిగో వస్తున్నాం...అదిగో వస్తున్నాం! అంటూ ఊరిస్తున్నారే  తప్ప ఎంట్రి ఇచ్చే సీన్ కనిపించడం లేదు.కాని  ఇరుగుపొరుగు వాళ్లు మాత్రం ఈ గ్యాప్ ని వాడేసుకుంటున్నారు.. టాలీవుడ్ సొమ్ముల్ని ఆరాంగా ఎత్తుకెళ్తున్నారు. రిసెంట్ గా సర్కార్ వచ్చి వెళ్లాడు.ప్రజంట్ 2.ఓ వసూళ్లన్నీ ఇక్కడి నుంచే వెళుతున్నాయి. కానీ మనవాళ్ల సందడి మాత్రం కనిపించడం లేదు. ఎందుకలా?. టాలీవుడ్ మాస్ హీరోలు ఇంత లాంగ్ గ్యాప్ తీసుకోవడానికి రీజన్ ఏంటి..?

                     టాలీవుడ్ గత కొంతకాలంగా మాస్ సినిమాల రీసౌండ్  మూగవోయింది . అపుడెపుడో వచ్చిన `అరవింద సమేత ` మినహా సరైన సినిమానే లేదు. మాస్ ఆడియాన్స్ ని  ఓ ఊపుఊపి బాక్సాఫీస్ని గజగజ ఒణికించే  సినిమా ఒక్కటంటే ఒక్కటీ రాలేదు. ఇది ఫ్యాన్స్ కే కాదు టాలీవుడ్ కి తీవ్ర నిరాశే. ఈ నిరాశ నుంచి బయటపడాలంటే ఇంకా చాలా కాలమే వేచి చూడాల్సిన దుస్దితి.కారణం ఈ డిసెంబర్లో `అంతరిక్షం` లాంటి  క్లాస్ సినిమా తప్ప  బాక్సాఫీస్ ని ఒణికించే మాస్ సినిమా ఏదీ కనిపించడం లేదు. అటుపై జనవరిలో ఉందిలే పండగ అన్న ఆలోచన తప్ప మాస్ లో అంత హుషారేం లేదు.

                      నిజానికి ప్రజంట్ జనరెషన్ ఆడియాన్స్  థియేటర్ల వైపు  వెళ్లాలంటే వచ్చే సినిమాలో ఓ రెంజ్ లో ఊపు తెచ్చే ఎలిమెంట్ ఏదైనా ఉండి తీరాలి. ఆ ఊపు రామ్ చరణ్ నటించిన `వినయ విధేయ రామా` వచ్చే వరకూ రాదేమో? అనే కామెంట్ వినిపిస్తోంది. అంటే కొత్త సంవత్సరం ఆరంభంలోనే మాస్ కి కొత్త ఉత్సాహం వస్తుందన్నమాట. జనవరి 9న ఎన్టీఆర్ బయోపిక్-1 `కథానాయకుడు`పై భారీ అంచనాలున్నా - మెగాభిమానుల్ని కదిలించే మాస్ సినిమా `వినయ విధేయ రామా` మరో రెండ్రోజుల గ్యాప్ తో వస్తోందని చెబుతున్నారు. జనవరి 11 తేదీని చెర్రీ కోసం లాక్ చేశారని తెలుస్తోంది. బోయపాటి మాసిజానికి చరణ్ గ్రేసు యాడైతే బాక్సాఫీస్ షేకవ్వాల్సిందే.

                     చెర్రి సినిమా తర్వత పరిస్దితి ఏంటి అంటే...దగ్గర్లో ఎవరూ కనిపించడం లేదు. చరణ్ మినహా ఇతర స్టార్ హీరోలంతా ఆలస్యంగానే వస్తున్నారు.ఇప్పటికే పవన్ సందడిని టాలీవుడ్ మిస్సయ్యింది. తమ్ముడు ఇచ్చిన గ్యాప్ని అన్నయ్య ఏమైనా ఫిల్ చేస్తాడా? అంటే అదీ కుదరలేదు. మెగాస్టార్  నటిస్తున్న `సైరా సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యే పరిస్దితి లేదు. కనీసం మహేష్ అయిన ఎంట్రి ఇస్తాడా అంటే   ఏప్రిల్ 5 వరకు వెచి చూడాల్సిందే.  ఈలోగా డార్లింగ్ ప్రభాస్ సందడి ఉంటుందా? అంటే `సాహో` సానా దూరంలోనే ఉంది. సమ్మర్ తర్వాతనే ఏక్ నిరంజన్ సందడి అని తెలుస్తోంది.మొత్తనికి టాలీవుడ్ మాస్ లో బాస్ లంతా రేసింగ్ కి దూరం దూరం అంటున్నారు. 2.0 - సర్కార్ లాంటి భారీ చిత్రాలన్నీ తమిళోల్లవే.. వీటితోనే ఇప్పటికి సంతృప్తి పడాల్సొచ్చింది... సంక్రాంతి రేసులోనే మళ్లీ డబ్బింగ్ సినిమాల జాతర ఉంది.  వీటితోనే ఈసారి సంక్రాంతి గడుస్తుంది.మరి  మనోళ్లు ఈ గ్యాప్ ని ఎప్పటికి ఫిల్ చేస్తారో ...మాస్ రూట్ లో ఎప్పడు స్పీడ్ పెంచుతారో....వెచి చూడాల్సిందే.

Aravinda Sametha
Varun
ntr
RAVI TEJA
ntr biopic
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Mass Movies Getting Full Crazy..?

YOU MAY LIKE