బిడ్డ స్పర్శ తగలగానే కోమా నుంచి..

Submitted by venkateshgullapally on Wed, 10/17/2018 - 14:45
బిడ్డ స్పర్శ తగలగానే కోమా నుంచి..

మనం సినిమాల్లో కొన్ని సన్నివేశాలు చూస్తూ ఉంటాం.. కోన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న వారికి తమ బిడ్డలా స్పర్శ తగలగానే ప్రాణం లేచి వస్తుంది.. అలాగే కోమాలో ఉన్న వారు వాళ్లకు నచ్చినా లేదా భయపడే శభ్డం లేదా స్పర్శ వింటే ఏళ్ళకు ఏళ్ళు కోమాలో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తు ఉంటారు.. ఇలాంటి సంఘటనే ఒకటి దక్షిణ అమెరికాలో జరిగింది. ఒక ఆస్పత్రి వైద్యులు చెప్పిన కథనం ప్రకారం...

బ్రెజిల్‌‌లోని ఫోర్టాలెజా ప్రాంతానికి చెందిన అమండా డిసిల్వా(28)  రెండు వారాల నుంచి కొమాలో ఉంది. ఇదే సమయంలో ఆమె గర్భిణి. దీనితో సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సివచ్చింది.  అనంతరం బయటకు తీసిన బిడ్డను తల్లి ఛాతీపై ఉంచిన కొద్దిసేపటికి ఆమెకు స్పృహ వచ్చింది. అసలు ఆపరేషన్ చేస్తున్నంత సేపు స్పందించని ఆమె బిడ్డ స్పర్శ తాకగానే స్పందించడంతో వైద్యులు సైతం నివ్వెరపోయారు. ఏదైనా తల్లి ప్రేమ గొప్పది కదా.. కాగా అప్పుడే పుట్టిన ఆ శిశువు రెండు కిలోల బరువు ఉంది. దీంతో వైద్యులు ఆ శిశువుకు ప్రత్యేక వైద్యం అందించారు.

mom
brazil
Hospital
mother
doctor
mom out from coma

YOU MAY LIKE