పర్యాటక రంగానికి సరికొత్త విధానం

Submitted by ganesh on Mon, 08/27/2018 - 11:01
పర్యాటక రంగానికి సరికొత్త విధానం

               రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ఆ శాఖ కొత్త విధానాలకు శ్రీకారం చుడుతుంది. చాలా చోట్ల పర్యాటక ప్రాంతాల్లో ఇబ్బందిగా మారుతున్న అతిథ్యానికి... ప్రత్యామ్నాయ మార్గాలు వెతకటం ద్వారా పర్యాటకుల  సంఖ్య పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది..కేరళలో విజయవంతమైన హోం స్టే విధానాన్ని అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో పర్యాటకాన్ని పరుగులు పెట్టించాలని భావిస్తోంది.

               పర్యాటకులకు సకల సౌకర్యాలతో ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఆదాయంతో పాటు పర్యాటకులను పెంచుకునే మార్గాలపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ దృష్టిపెట్టింది. చాలా ప్రాంతాల్లో పర్యాటకులకు వసతి ఇబ్బందిగా మారుతుండటంతో... విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ వంటి నగరాల్లో అతిథి దేవోభవకార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఆయా ప్రాంతాలకు వెళ్లాలనుకున్న పర్యాటకులకు వసతి తీవ్ర సమస్యగా ఉంది. రెండు మూడు నెలలు ముందుగానే హోటళ్లలో గదుల కోసం ప్రయత్నిస్తున్నా.. కీలక సమయాల్లో దొరకటం లేదు. ఈ నేపథ్యంలోనే సాంస్కృతిక పర్యాటక శాఖ, పర్యాటక అభివృద్ధి సంస్థ కలిసి సంయుక్తంగా అతిథి దేవోభవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.

               రాష్ట్రంలో పేరున్న బీచ్ లు, బుద్ధ ప్రాంగణాలు, కోనసీమ అందాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, అరకు సోయగాలు.. ఇలా వివిధ ప్రాంతాలను సందర్శించేవారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. తరచూ జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాల నిర్వహణతో గుంటూరు, విజయవాడ, తిరుపతి, విశాఖ, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు పర్యాటకుల తాకిడి అధికమవుతోంది. కానీ పర్యాటకులకు ఆశించిన స్థాయిలో సౌకర్యాలు అందుబాటులో లేక వసతి సమస్య తలెత్తుతోంది.

               పర్యాటకుల అతిథ్య సమస్యను అధిగమించేందుకు ఆన్‌లైన్‌ వేదికగా ఎయిర్‌బీఎన్‌బీ సంస్థ సహకారంతో హోం స్టే కార్యక్రమానికి పర్యాటక శాఖ చర్యలు చేపట్టింది. దీని ద్వారా విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లోని సొంతిళ్ల యజమానులు.. ఇంట్లో ఖాళీ గదులను పర్యాటకులకు అద్దెకు ఇవ్వటం ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ముందుగా ఎయిర్‌బీఎన్‌బీలో లాగిన్‌ అయ్యి వివరాలు నమోదు చేసుకొని అన్ని అనుమతులు, రక్షణాత్మక చర్యలు తీసుకున్నాకే ఆన్‌లైన్‌లో ఈ సౌకర్యం కల్పిస్తారు.

              హోం స్టే కార్యక్రమంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పర్యాటకాధికారులు వర్క్ షాప్ లు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు విశాఖలో రెండుసార్లు, విజయవాడలో ఒకసారి వర్క్ షాబ్ నిర్వహించిన అధికారులు..రెండో దశలో తిరుపతి, అమరావతి, రాజమహేంద్రవరం, అనంతపురాల్లో వర్క్ షాప్ లు నిర్వహించనున్నారు. ప్రజల సందేహాలు నివృత్తి చేస్తూ ఆదాయం ఎలా పెంచుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలోని విశాఖ, తిరుపతి, విజయవాడల నుంచి సుమారు 130 మంది అతిథి దేవోభవకార్యక్రమం కింద పేర్లు నమోదు చేసుకున్నారు.

               హోం స్టే విధానం ఇప్పటికే కేరళలో విజవంతమైంది.. పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా అక్కడ ఇళ్లను నిర్మించుకుని ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇళ్ల పక్కన వృక్షాలపై ట్రీహౌస్‌లను నిర్మించి అద్దెకిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు మహారాష్ట్రలోనూ ఈ విధానం ప్రాచుర్యంలో ఉంది.

              హోంస్టే విధానాన్ని తొలుత నగరాల్లో ఆ తరువాత గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు.. ఈ విధానం విదేశీయులను ఆకట్టుకుంటుంది. దీంతో ప్రజల్లో చైతన్యం తేవడానికి పర్యాటక శాఖాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.. వసతిసౌకర్యాలు సమకూర్చడం, పర్యాటకులు ఆతిథ్యం ఇస్తున్నవారిపై నమ్మకంతో వ్యవహరించడం ద్వారా ఈ విధానం విజయవంతమవవుతుందని పర్యాటక శాఖ అధాకారులు బావిస్తున్నారు.

tourism
AP Tourism
AP Tourism Award
AP Tourism News
AP Tourism Latest
AP Tourism Latest News
AP Tourism Breakings
AP Tourism Breaking News
AP Tourism Updates
AP Tourism Update News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
A New Ideology For Tourism

YOU MAY LIKE