ప‌ది మందికి పైగా క‌థానాయిక‌ల‌తో ఎన్టీఆర్ బ‌యోపిక్...

Submitted by ganesh on Thu, 12/06/2018 - 16:54
ప‌ది మందికి పైగా క‌థానాయిక‌ల‌తో ఎన్టీఆర్ బ‌యోపిక్...

                    టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయోపిక్ ను ఎప్పుడెప్పుడు తెరమీద చూద్దామా అని ఎదురు చూస్తున్నారు తెలుగు సిని జనం.దానికి తగ్గటే ఇంకొక్క నెల రోజుల్లో కథానాయకుడు రూపంలో మొదటిభాగం రిలీజ్ కానుంది. దినికి తగ్గటే ఈ సినిమా ప్రమోషన్ విషయంలో ఎన్టీఆర్ టీం చాలా యాక్టివ్ గా ఉంది.కాని ఇంటర్నల్ గా మాత్రం స్టోరి విషయంలో డైరెక్టర్ ఏం చూపించలో తెలియక తికమక పడుతున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయ్. ఇప్పటికే అనుకున్న స్క్రిప్ట్ కి రకరకాల మార్పులు చేసి కథను కిచ్చిడి చెశేసారు అనే టాక్ ఊపందుకుంది.ఇంతకి ఇందులో నిజమేతం..?సడన్ గా ఈ సినిమా పై నెగిటివ్ టాక్ ఊపందుకోవడానికి రీజన్ ఏంటి?.ఇప్పుడు చూద్దాం.

                     టాలీవుడ్ లో ఓ బయోపిక్‌ తీసేముందే ఏది తీయాలి, ఎంత వుంచాలి అనే దానిపై అవగాహన వుండాలి. ఎన్టీఆర్‌ బయోపిక్‌ విషయంలో ముందునుంచి దర్శకులకి క్లారిటీ లేకుండా పోయింది. ఆ కన్‌ఫ్యూజన్‌ తట్టుకోలేకే తేజ మధ్యలో డ్రాప్‌ అయిపోయాడు. క్రిష్‌ దానికి ఒక రూపమిచ్చి, అంచనాలయితే పెంచేసాడు కానీ మొదలు పెట్టే ముందే బౌండ్‌ స్క్రిప్ట్‌ డిసైడ్‌ అవలేదు. దీంతో ఎన్టీఆర్‌ జీవితంలోని పలు ముఖ్య ఘట్టాలన్నీ షూట్‌ చేసేసారు. తీరా దానిని మూడు గంటల సినిమాగా కుదించడం వీలు కాలేదు. అందుకని అయిదు గంటల సినిమా చేసి రెండు భాగాలుగా విడగొట్టారు. అయితే ప్రస్తుతం అంతకుమించిన కంటెంట్‌ చేతిలో వుందని, ఏ సీన్‌ని తీసేయడానికి అటు దర్శకుడికి లేదా ఇటు బాలకృష్ణకి నచ్చడం లేదని, దీంతో మొదటి భాగం లెంగ్త్‌ బాగా పెరిగిపోయిందని టాక్‌ వినిపిస్తోంది.

                      మొదటి భాగం మొత్తం ఎన్టీఆర్‌ సినీ జీవిత విశేషాలతోనే నడిచిపోతుందట. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి అడుగు పెట్టడంతో మొదటి భాగం ఎండ్‌ అవుతుందట. అయితే ఎన్టీఆర్‌ ఎన్నో గొప్ప చిత్రాలు చేయడం వల్ల ఆయా సీన్లన్నీ ఇందులో వుండాలని అన్నీ తీసేయడం వల్ల ఏది రిమూవ్ చేయలో అర్థం కాక క్రిష్ కన్ఫూజన్ లో పడ్డాడట. మరోవైపు ఎన్టీఆర్‌కి భార్యా పిల్లలతో వున్న అనుబంధాలని కూడా కవర్‌ చేయడం వల్ల లెంగ్త్‌ పెరిగిపోయిందని, ఎడిటింగ్‌కి కష్టమవుతోందని ఇంటర్నల్ టాక్‌.

                       మొత్తనికి ఎన్టీఆర్ బయోపిక్ పస్ట్ ఫార్ట్ ఫైనాల్ వర్షన్ ఫినిష్ చేసే పనిలో బిజి అయ్యాడు క్రిష్.కథనాయకుడులో బాలయ్య , క్రిష్ ఇద్దరూ పోటీ పడి మరి  అన్ని ఇందులో పెట్టేసారట. ఎలాగూ రెండు భాగాలూ కలిపి ఐదు గంటలకు పైగా వ్యవధి దొరికింది కాబట్టి ఎంత కావాలన్నా జోడించుకోవచ్చు. మరి ఎన్టీఆర్ లో ఈ మసాలాలు అతికించడం ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది  అనేది ప్రశ్నర్థకంగా మారింది. ఎన్టీఆర్ నిజ జివితంలో ఉన్న అంశలకన్న...కోసరు విషయాలను ఎక్కువగా చూపిస్తే...ఈ సినిమా పై బ్యాడ్ టాక్ వచ్చే ఛాన్స్ ఉంది.మరి ఈ విషయంలో బాలయ్య  అండ్ కో...ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో వెచి చూడాల్సిందే.

ntr
ntr biopic
balakrishna ntr biopic
NTR Bio Pic News
Ntr biopic updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
NTR BioPic With More Than 10 Heros

YOU MAY LIKE