ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం

Submitted by Likhitha on Tue, 11/06/2018 - 15:11
ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం

                    ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది.. దేశ రాజధానిలో ప్రజలకు ఊపిరాడనివ్వకుండా చేస్తోంది.. రోడ్డుమీద వెళ్లడానికే కాదు.. ఇంట్లో ఉన్నా గాలి పీల్చాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.. ప్రభుత్వ చర్యలతో కాలుష్యం కొంత తగ్గినా, 20 రోజులుగా మళ్లీ విపరీతంగా పెరిగిపోయింది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రమాణాల ప్రకారం నగరంలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. భారీ స్థాయిలో పెరుగుతున్న వాహనాల సంఖ్య కూడా కాలుష్యాన్ని మరింత జఠిలం చేస్తోంది. కాలుష్యం పెరగడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. కంటి మరియు గొంతు సంబంధిత సమస్యలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. కాలుష్యం పొగమంచులా పూర్తిస్థాయిలో కమ్మేస్తుండడంతో వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు.    

                    గత కొన్ని రోజులుగా కాలుష్యం అధికమవుతుండడంతో ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాలుష్యం తగ్గేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోంది. వాతావరణ శాఖ కూడా పలు సూచనలు చేస్తోంది. కానీ కాలుష్యం ఏమాత్రం తగ్గడం లేదు. చలికాలం కావడం పొగమంచుకు తోడు కాలుష్యం అధికమవుతోంది. సెంట్రల్ ఢిల్లీ, మందిర్ మార్గ్ ప్రాంతాల్లో ప్రజలు గాలి కూడా పీల్చలేకపోతున్నారు. కాలుష్యం అధికంగా నమోదవడంతో ఆందోళనకు గురవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని వాతవరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారంటే ఢిల్లీలో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతోంది. దీపావళి సందర్భంగా కాల్చే టపాసులతో మరింత కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.

delhi
Air Pollution
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
People Suffer to Breathe Air in Delhi With Air Pollution
Video URL

YOU MAY LIKE