కేసులో పురోగతి సాధించిన పోలీసులు

Submitted by ganesh on Fri, 11/02/2018 - 14:25
కేసులో పురోగతి సాధించిన పోలీసులు

                 రెండు రోజులు సమయం జగన్ పై హత్యాయత్నం కేసులో పోలీసులు ఏ పురోగతి సాథించనున్నారు.? ఇవాళ్టితో ఏదో ఒకటి తేల్చేస్తారా? లేక మళ్ళీ పాతపాటే పాడతారా ? నిందితుడు సిట్ కు ఎందుకు సహకరించడం లేదు.? అతని కున్న ధీమా ఏమిటి. కాల్ డేటాలో  అమ్మాయిలతో ఉన్న లింకులెక్కువ ఉండటానికి వెనకున్న అసలు కథేమిటి..?

                   ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై జరిగిన దాడి కేసు దర్యాప్తు ఒకింత గందరగోళంగా సాగుతోంది. నిందితుడి శ్రీనివాసరావు కస్టడీ ఇవాళ్టితో ముగుస్తున్నా ఇంతవరకూ పోలీసులు కీలక అంశాలను పట్టుకోలేదు. అసలు శ్రీనివాసరావు ఎందుకు దాడికి పాల్పడ్డాడు. దాడి చేయడానికి కారణాలేంటి.. అతని వెనుక ఎవరైనా ఉన్నారా..? అనే ప్రశ్నలకు ఇంతవరకూ సమాధానాన్ని రాబట్టలేకపోయారు.

                    దర్యాప్తులో ఇప్పటివరకు పోలీసులు కీలక ఆధారాలను సంపాదించలేదు. నిందితుడు శ్రీనివాసరావు తానే కావాలని దాడి చేసానంటూనే ఏవేవో కారణాలు చెప్తున్నాడు. అంతేకాదు పోలీసులకు సగంసగం సమాధానాలిస్తున్న నిందితుడు.. వివరాలం కావాలంటే లేఖలో చూసుకోమని చెప్పడం.., విచారణకు సరిహా సహకరించపోవడంతో కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు. దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు శ్రీనివాసరావు ఫోన్ కాల్ డేటా ఆధారంగా అనుమానితులను విచారిస్తున్నారు. నిందితుడి ఆర్ధిక లావాదేవీలు, మహిళలతో సంబంధాలు తప్ప మరో కొత్త కోణం దొరకడం లేదు. ఎయిర్ పోర్ట్ VIP లాంజ్ లో సీసీ కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తు మరింత కష్టమవుతోంది.

                       ఇవాళ్టితో నిందితుడు శ్రీనివాస్ కస్టడీ ముగియబోతోంది. సిట్ విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి రిమాండ్ కు తరలించాల్సి ఉంటుంది. ఐతే ఇప్పటివరకు కేసును చేధించేందుకు సరైన ఆధారం ఒక్కటి కూడా సంపాదించలేదు. కేసును కొలిక్కి తీసుకురావాలంటే మరికొంత సమయం పడుతుందని పోలీసులంటున్నారు. ఇందుకోసం శ్రీనివాసరావును మరోసారి కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరే అవకాశముంది.

                        శ్రీనివాసరావును అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు వివిధ కోణాల్లో విచారించి పూర్తి వివరాలు రాబట్టుకోలేకపోయిన పోలీసులు ఇప్పటివరకు జరపిన విచారణపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. దీంతో మరోసారి కస్టడీకి ఇస్తే విచారణ సరిగా పూర్తవుతుందా లేదా..? అసలు ఈ కేసుకు సరైన ముగింపు వస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ys jagan
ys Jagan updates
YS Jagan Court Enquiry
YS Jagan in CBI Court
YS Jagan Press Meet
ys jagan news
YS jagan latest news
YS Jagan Latest updates
YSRCP Latest News
ysrcp news
YS Jagan Announcement
YS Jagan Padayatra
YSRCP Padayatra
YS Jagan Fires
YS Jagan Comments
YSRCP Fires
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
police are getting progress in case

YOU MAY LIKE