పోలీసుల తనిఖీలు...రాజకీయ నాయకుల గుండెలో రైలు...

Submitted by ganesh on Thu, 12/06/2018 - 13:24
పోలీసుల తనిఖీలు...రాజకీయ నాయకుల గుండెలో రైలు...

                    ఎన్నికల నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నా.. పోలీసులు ఎన్ని తనిఖీలు చేసినా రాజకీయ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూనే ఉన్నారు. ప్రచార పర్వం ముగియడంతో నేతలు ప్రలోభాల పర్వానికి తెరలేపారు. డబ్బు, చీరలు ఇతర బహుమతులతో ఓట్లను కొనుక్కునేందుకు సిద్ధమయ్యారు.

                   ఎన్నికల వేళ తెలంగాణలో భారీగా నగదు, మద్యం చీరలు పట్టుబడుతున్నాయి. ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు నేతలు నోట్ల కట్టలు బయటకు తీస్తున్నారు. గంటగంటకూ భారీగా నగదు పట్టుబడుతోంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 129 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి.

                    మంచిర్యాల రాజీవ్ నగర్లో ఓటర్లకు చీరలు పంచుతున్న టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంతో పట్టణంలోని వెంకటేశ్వర షాపింగ్ మాల్ గోడౌన్ పై టాస్క ఫోర్స్ పోలీసులు దాడిచేశారు. సరైన పత్రాలు లేని దాదాపు 6 లక్షల విలువైన 2,100 చీరలను పట్టుకున్నారు. షాప్ యజమాని సురేందర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ చీరలు టీఆర్ఎస్ పార్టీ కి చెందినవిగా సురేందర్ వెల్లడించినట్లు మంచిర్యాల పోలీసులు తెలిపారు.

                    వరంగల్ జిల్లా కాజీపేటలో గోపాలరావు అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్రమంగా ఉంచిన 2 కోట్ల రూపాయల నగదును ఎన్నికల  ప్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. తెలంగాణ జనసమితి అభ్యర్థి పగిడిపాటి దేవయ్యకు చెందిన నగదుగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు... ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

                  హైదరాబాద్ లోనూ భారీగా డబ్బు పట్టుబడుతోంది. ఇప్పటికే పోలీసుల తనిఖీల్లో కోట్లాది రూపాయలు బయటపడ్డాయి. తాజాగా కూకట్ పల్లిలో నోట్ల కట్ల కలకలం రేగింది. ఏపీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకరరావు ఇంటి సమీపంలో పోలీసులు పెద్దఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు కట్టలతో పారిపోతున్న ఇద్దరు వ్యక్తులను టీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకున్నారు. సంచులు తెరిచిచూడగా అందులో 17లక్షలకు పైగా నగదు లభ్యమైంది. దీంతో పోలీసులు జూపూడి నివాసంలో కూడా తనిఖీలు చేశారు. ఎన్నికలకు ఇంకా ఒక రోజే సమయం ఉండటంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

Police
Police News
Police Breakings
Police Breaking News
Police Breaking Updates
Police Latests
Police Latest News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Police Searching and Political Leaders are in fear

YOU MAY LIKE