శ్రీలంకలో రాజకీయ సంక్షోభం

Submitted by ganesh on Sun, 10/28/2018 - 08:35
శ్రీలంకలో రాజకీయ సంక్షోభం

                     శ్రీలంకలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతుంది. దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పార్లమెంటును వచ్చే 16 వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పార్లమెంటును అత్యవసరంగా సమావేశపరిచి మెజారిటీ నిరూపించుకోవాలనుకున్న రణిల్ విక్రమంసింగే ఆశలు అడియాశలయ్యాయి. ప్రస్తుతం సభ్యుల బలం లేని రాజపక్సకు మరింత సమయం ఇచ్చేందుకు అధ్యక్షుడు పార్లమెంటును వచ్చే నెల వరకు సస్పెండ్ చేసినట్లు భావిస్తున్నారు.    

                     శ్రీలంకలో రాజకీయం మరింత వేడెక్కుతుంది. రణిల్ విక్రమసింగేను ప్రధాని పదవి నుంచి దించేసిన దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, శ్రీలంక పార్లమెంటును తాత్కాలికంగా రద్దు చేశారు. బల నిరూపణ కోసం అత్యవసరంగా  పార్లమెంటును సమావేశపరచాలని రణిల్ విక్రమసింఘే పార్లమెంటు స్పీకర్ ను కోరగా అందుకు అవకాశం లేకుండా నవంబర్ 16 వరకు పార్లమెంటును రద్దు చేస్తూ సిరిసేన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటులో జరిగే బలపరీక్షలో విక్రమసింఘేను ఓడించాలనే లక్ష్యంతో అధ్యక్షుడు ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది.

                   ఇక శ్రీలంక పార్లమెంటులోని మొత్తం స్థానాల సంఖ్య 225 కాగా, బలనిరూపణలో నెగ్గేందుకు కనీసం 113 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది.. సిరిసేన సపోర్టర్స్  కొత్త ప్రధాని మహిందా రాజపక్స రెండూ కలిసినా వారి బలం 95 మాత్రమే ఉంది. అటు విక్రమసింఘేకు చెందిన యునైటెడ్ నేషనల్ పార్టీకి సొంతంగానే 106 మంది సభ్యులున్నారు. ఇండిపెండెంట్లు, చిన్నపార్టీలతో బలపరీక్ష నెగ్గడం ఆయనకు నల్లేరమీద నడక. ఈ నేపథ్యంలో నవంబర్ 5నుంచి పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తే విక్రమ సింఘే సులుభంగా బలపరీక్షలో నెగ్గి మళ్లీ అధికారంలోవచ్చే ఛాన్స్ ఉందని అంచనావేసిన సిరిసేన అయనకి చెక్ పెట్టారని రాజకీయ విశ్లేషకులంటున్నారు.  మరో పది రోజులు పాటు సభ జరక్కుండా వాయిదా వేస్తే ఈలోగా సిరిసేన, రాజపక్సలు వర్గం మరికొంత మంది సభ్యులను తమవైపునకు  తిప్పుకోవచ్చని అందుకే సమావేశాల ప్రారంభ తేదీని నవంబర్ 16కు మార్చారని శ్రీలంక రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న వారంటున్నారు.

                      కొత్తగా ప్రధాని మారినందున రాజపక్స వార్షిక బడ్జెను కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెను ప్రవేశపెట్టనున్నారనీ, ఆబడ్జెట్ రూపకల్పనకు సమయం పడుతుంది కాబట్టే పార్లమెంటు సమావేశాలు పది రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతాయనేది రాజపక్స పార్టీల వాదన.. మరో వైపు కావాలనే మైత్రీపాల సిరిసేన దేశంలో కృత్రిమ రాజకీయ సంక్షోభం సృష్టిస్తున్నారని, బలనిరూపణకు పార్లమెంటును సమావేశపరిస్తే వెంటనే వివాదం సమసిపోతుందని విక్రమసింఘే ఆరోపిస్తున్నారు.. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ రాజపక్స, సిరిసేనల పార్టీలు కలిసి విక్రమసింఘేపై అవిశ్వాస తీర్మానం పెట్టగా అప్పటి బలనిరూపణలోనూ విక్రమ సింఘే గెలిచారు. శ్రీలంక సంక్షోభం తారాస్థాయికి చేరుకోవడంతో నవంబర్ 16 లోపు ఎన్ని క్యాంపు రాజకీయాలు, ప్రలోభాలతో పార్టీల మార్పులు తర్వాత ఎవరు ప్రధాని అవుతారని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది..

Political Crisis
Sri Lanka
Political Crisis News
Political Crisis Breakings
Political Crisis Breaking News
Political Crisis Breaking Updates
Political Crisis Update News
Political Crisis New Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Political Crisis in Sri Lanka

YOU MAY LIKE