రాజశేఖర్ వేగం పెంచాడా..?

Submitted by ganesh on Wed, 10/31/2018 - 16:00
రాజశేఖర్ వేగం పెంచాడా..?

                   టాలీవుడ్ లో పీఎస్వీ గరుడవేగతర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ ఇప్పుడు మరో మూవికి రెడీ అయ్యాడు.ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో కల్కి మూవిని తెరకెక్కిస్తున్నాడు. రిసెంట్ గా పస్ట్ లుక్  రిలీజ్ చేయడంతో ఈ సినిమా పై అటేక్షన్ పెరిగింది.కాని హీరోయిన్స్ విషయంలో కాస్త సస్పెన్స్ నడిచింది.మొన్నటి వరకు రక రకాల పేర్లు వినిపించిన ఇప్పుడు ఫైనాల్ కాస్టింగ్ ఓకే అయినట్టు తెలుస్తుంది.ఇంతకి ఈ సినిమాలో 3గురు హీరోయిన్స్ ని పెట్టడానికి రీజన్ ఏంటి?.దాని వెనుకున్న మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

                    టాలీవుడ్  హీరో రాజశేఖర్ చాలా ఏళ్ల తర్వాత తన ఉనికి చాటుకున్న సినిమా పీఎస్వీ గరుడవేగ’. గత ఏడాది తెలుగులో వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ఇదొకటి. ఈ సినిమా కమర్షియల్‌గా సక్సస్ కాకపోయిన.. రాజశేఖర్‌ను మాత్రం హీరోగా నిలబెట్టింది.గరుడవేగతర్వాత ఈ  హీరో కల్కిఅనే కొత్త సినిమాకు కమిటైయ్యాడు. అ!దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైనా పస్ట్ లుక్ ఆడియాన్స్ లో అటేక్షన్ పెంచింది. ఇది 1983 నేపథ్యంలో సాగే పీరియడ్ ఫిలిం అట. రాజశేఖర్ ఇందులోనూ పోలీస్ ఆఫీసర్ పాత్ర లో కనిపించనున్నాడు.

                     తాజాగా ఈ సినిమాకి సంబంధించి స్టార్ కాస్టింగ్ పైనాల్ అయ్యింది. రాజశేఖర్ సరసన ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించనుండటం విశేషం. ఎక్కడికి పోతావు చిన్నవాడాహీరోయిన్ నందిత శ్వేతతో పాటు హార్ట్ ఎటాక్హీరోయిన్ ఆదా శర్మ.. ఎవడులో ఐటెం సాంగ్ చేసిన స్కార్లెట్ విల్సన్ ఈ చిత్రానికి కథానాయికలుగా ఖరారయ్యారు. విశేషం ఏంటంటే ఈ చిత్రానికి రాజశేఖర్ కూడా నిర్మాణ భాగస్వామే. సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్‌తో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఈ హీరో.

                   మొత్తనికి 80వ దశకంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా కల్కి మూవిని తెరకెక్కించబోతున్నాడు ప్రశాంత్ వర్మ. అ!తో ప్రశాంత్ ఆశించిన ఫలితమేమీ అందుకోలేదు. ఈ సినిమా విషయంలో మిశ్రమ స్పందన వచ్చింది. ఈసారి ప్రశాంత్ తనేంటో రుజువు చేసుకోవడంతో పాటు కమర్షియల్ సక్సెస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. రాజశేఖర్‌తో పాటు నిర్మాత కళ్యాణ్‌కూ ఈ సినిమా ఎంతో కీలకం.అందుకే ఈ సినిమాలో కమర్షల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండేలా ..ప్రజంట్ జనరేషన్ కి కనక్ట్ అయ్యేలా స్టోరిని రెడీ చేసాడు.మరి ఈ సినిమాతో ప్రశాంత్ కెరిర్ ఎలాంటి యూ టర్నతీసుకుంటుందో రాజశేఖర్ ఎకౌంట్ లో ఎలాంటి హిట్ పడుతుందో వెచి చూడాల్సిందే.

rajshekhar hero
rajshekhar
rajshekhar News
rajshekhar Breakings
rajshekhar Breaking News
rajshekhar Breaking Updates
rajshekhar Update News
rajshekhar News Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
RajeshShekar Is Doing New Movie

YOU MAY LIKE