ఎన్నిక‌ల ప్ర‌చార పర్వానికి గులాబి బాస్ రెడీ...

Submitted by ganesh on Thu, 11/08/2018 - 18:48
ఎన్నిక‌ల ప్ర‌చార పర్వానికి గులాబి బాస్ రెడీ...

                    గులాబి అధినేత కేసీఆర్   ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నారు. ఈ నెల 12 నుంచి వరుసగా ఎలక్షన్ క్యాంపైన్ నిర్వహించనున్నారు.  100సీట్ల గెలుపే ల‌క్ష్యంగా త‌న‌యుడు కేటీఆర్,అల్లుడు హ‌రీష్ ఇప్పటికే కీల‌క  బాధ్యత‌లు అప్ప‌గించిన కేసీఆర్  క్రిటిక‌ల్ గా ఉన్న దాదాపు 30నియోజ‌క‌వ‌ర్గాల్లో స్వ‌యంగా ప్ర‌చారం చేయనున్నారు. ఈ మేరకు    రూట్ మ్యాప్ కూడా  సిద్దం చేసిన‌ట్లు స‌మాచారం. నామినేష‌న్ల ప‌ర్వం ప్రారంభంనుంచే ప్ర‌చారంలో దూసుకుపోవాల‌ని   హెలికాఫ్ట‌ర్ల సైతం సిద్దంచేయించారు గులాబి బాస్.

                      ఈనెల 12నుంచి ఎన్నిక‌ల ప్ర‌చార‌క్షేత్రంలో దిగుతున్న కేసీఆర్...అందుకు త‌గ్గ‌ట్లు భారి వ్యూహాల‌ను ర‌చిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో 63 స్థానాల‌ను త‌గ్గించుకున్న టీఆర్ఎస్ పార్టీ...ఈసారి మాత్రం 100సీట్ల‌కు త‌గ్గ‌కుండా గెలిచే విదంగా అధినేత కేసీఆర్ చేస్తున్న క‌స‌ర‌త్తు అంతా ఇంతా కాదు. ఫామ్ హౌజ్ వేదిక‌గా  ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితి..ఇప్పుడు అనుస‌రించాల్సిన ప్ర‌చార విధివిధానాల‌ను సిద్దం చేశారు. రానున్న రెండు రోజుల్లో తుది మేనిఫెస్టోను ప్ర‌క‌టించ‌డంతో పాటూ....పెండింగ్ లో ఉన్న 12నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి..అంద‌రికి బీ-ఫామ్ లు ఇచ్చాక‌...సోమ‌వారం నుంచి ప్ర‌జాక్షేత్రంలో దిగ‌బోతున్నారు కేసీఆర్.

                      నోటిఫికేష‌న్ వెలువ‌డిన అనంత‌రం అభ్య‌ర్థులంతా నామినేష‌న్ల ప‌ర్వాన్ని ముగించుకోని ఇక ప్ర‌జ‌ల్లోకి పూర్తిస్థాయిలో వెళ్లాల‌ని ఇప్ప‌టికే కేసీఆర్ అభ్య‌ర్థుల‌కు ఆదేశాలు పంపారు. అయితే దాదాపు నెల‌రోజులుగా గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నా...అది స‌రిపోద‌ని ప్ర‌భుత్వ ప‌థకాలతో ల‌బ్దిపొందిన ఓట్లే టార్గెట్ గా కృషిచెయ్యాల‌ని కేసీఆర్ దిశా-నిర్ధేశం చేశారు. నోటిఫికేష‌న్ వెలువ‌డిన నాటినుంచి ఎన్నిక‌ల‌కు 25రోజుల వ‌ర‌కు ప్ర‌చారం నిర్వ‌హించుకొనే వ్య‌వ‌ధి ఉంటుంది కాబ‌ట్టి...అభ్య‌ర్థులతో పాటూ...ఎన్నిక‌ల  బాధ్యత‌లు నిర్వ‌హించే టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌లంతా ప్ర‌తి ఇంటికి మ‌రోద‌ఫా తిరిగేలా ప్రణాళిక‌లు సిద్దం చేసుకోవాల‌ని సూచించారు.

                         2009 ఎన్నికల్లో తానే ముందుండి నడిపించిన కేసీఆర్ ఈ సారి రూటు మార్చి తనయుడు కేటీఆర్ అల్లుడు హరీష్ ముందు రంగంలోకి దించారు.  సరిగ్గా నోటిఫికేషన్ వెలువడే సమయంలో తాను ప్రచార పర్వంలోకి ఎంట్రీ ఇస్తున్నారు.  ఉత్త‌ర తెలంగాణ‌లోని కీల‌క‌మైన మెద‌క్,క‌రీంన‌గ‌ర్, వ‌రంగల్ జిల్లాల భాద్య‌త‌లు హ‌రీష్ కు పూర్తిస్థాయిలో అప్ప‌గించిన‌ట్లు స‌మాచారం. దాదాపు 25నియోజ‌క‌వ‌ర్గాల్లో హ‌రీష్ మార్క్ ఉండేలా రూట్ మ్యాప్ సిద్దం చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు కేటీఆర్ కు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ,ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా భాద్య‌త‌లు అప్ప‌గించారు కేసీఆర్. కేటీఆర్ కు సైతం 25నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌చ్చితంగా టీఆర్ఎస్ జెండా ఎగ‌ర‌వేసేలా ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని...కేటీఆర్ మార్క్ చూపించాల‌ని గులాబిబాస్ కోరిన‌ట్లు స‌మాచారం. ఇక ద‌క్షిణ తెలంగాణ‌లో పార్టీ గెలుపు భాద్య‌త‌లు స్వ‌యంగా కేసీఆర్ చూసుకోబోతున్నారు.  న‌ల్గొండ‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఉమ్మ‌డి జిల్లాల్లు మ‌రోవైపు ఖ‌మ్మంలోని కొంత‌మేర పార్టీని గెలిపించే దిశ‌గా కేసీఆర్ ప్ర‌త్యేక శ‌ద్ర పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. దాదాపు 30నియోజ‌క‌వ‌ర్గాల్లో కేసీఆర్ మార్క్ చూపెట్టే విధంగా రూట్ మ్యాప్ సిద్ద‌మ‌య్యింది. అయితే అధ్య‌క్షుడి హోదాలో అన్ని నియోజ‌వ‌ర్గాల్లో కేసీఆర్ పర్య‌టించినా...తాను కేటాయించుకున్న 30నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు భాద్య‌త‌లు తీసుకుంటున్న‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది. ఇందుకోసం మూడు ప్ర‌త్యేక హెలికాఫ్ట‌ర్ల‌ను సిద్దంచేయించారు కేసీఆర్.

                         తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ఈ నాలుగున్న‌ర ఏళ్ల‌లో ప్ర‌భుత్వం అమ‌లు చేసిన ప‌థ‌కాల‌ను ప్ర‌తి కుటుంబానికి తీసుకెల్లే విదంగా ప్ర‌చారం నిర్వ‌హించ‌డంతో పాటూ..టీడిపి-కాంగ్రెస్ పొత్తు..తెలంగాణ కు రానున్న రోజుల్లో మ‌హా విప‌త్తు అనే విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని ఈ  బాధ్యత‌ల‌ను సైతం హ‌రీష్ కు కేటీఆర్ కు కేసీఆర్ అప్ప‌గించారు. 105నియోజ‌క‌వ‌ర్గాల‌నుంచి ప్ర‌జ‌ల రెస్పాన్స్ పై ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్న కేసీఆర్...100స్థానాలు త‌ప్ప‌క గెలువ‌బోతున్నామ‌ని..అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు కేసీఆర్ న్యాయ‌క‌త్వాన్నే కోరుకుంటున్న‌ట్లు...ఆ దిశ‌గా ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని మ‌రింత భ‌ల‌ప‌రిచేలా ప్ర‌చారం ఉండాల‌ని   వ్యూహాల‌ను ర‌చించారు. రెండు రోజుల క్రితం వ‌ర‌కు మ‌హాకూట‌మి పోటి వ‌స్తుంద‌నుకున్నామ‌ని..కాని ఇంకా అభ్య‌ర్థులు ఖ‌రారు కాక‌పోవ‌డం...మ‌రోవైపు అస‌మ్మతులు భారిస్థాయిలో ఉండ‌టంతో ...ఈ కుమ్ములాట‌ల ప్ర‌భుత్వం క‌న్నా....కేసీఆర్ మిన్న అనే ఫీడ్ బ్యాక్ ప్ర‌జ‌ల‌ నుంచి వ‌చ్చిన‌ట్లు సీనియ‌ర్ నేత‌ల‌కు గులాబిబాస్ చెప్పిన‌ట్లు స‌మాచారం. కూట‌మి సీట్ల కేటాయింపు అనంత‌రం...అభ్య‌ర్థుల‌కు ప్ర‌చారంలో స‌మ‌యం స‌రిపోద‌ని...ఇప్ప‌టికే మ‌న పార్టీ అభ్య‌ర్థులు ఓక్కో ఇంటికి రెండు మూడు సార్లు వెల్లిన‌ట్లు...ప్ర‌జ‌ల ఓటు బ్యాంక్ అంతా త‌మ‌వైపు ఉన్న‌ద‌నే ధీమా కేసీఆర్ వ్య‌క్తం చేస్తున్నారు.

                             ఇక హైద‌రాబాద్ లోని సిట్టింగ్ బీజేపి స్థానాల‌ను ఈసారి టీఆర్ఎస్ కైవ‌సం చేసుకునేలా కేసీఆర్ న‌జ‌ర్ పెట్టారు. ఈ భాద్య‌త‌ల‌ను కేటీఆర్ అప్ప‌గించి. ఎలాగైనా బీజేపికి సింగిల్ సీట్ రాకుండా చూడాల‌ని ఆదేశించిన‌ట్లు స‌మాచారం. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాల‌పై స్వ‌యంగా కేసీఆర్  పోకస్ పెట్టడంతో ఆ స్థానాల్లో కాంగ్రెస్ ఓట‌మి ఖామ‌మ‌నే సంకేతాలు గులాబి బాస్ శ్రేణులకు అందిస్తున్నారు. మొత్తానిక కేసీఆర్ అనుకున్న 100సీట్ల వ్యూహం ఏ మేర‌కు ఫ‌లిస్తుందో ఎదురుచూడాల్సిందే.

KCR Leaders
KCR leaders Fire
KCR Leaders Comments
KCR leaders Sensational Comments
KCR Leaders Fires
KCR Leaders Start Devlopment Works
Intintiki KCR
kcr
KCR updates
KCR Latest updates
KCR Tour
KCR Press Meet
KCR news
KCR latest news
KCR Latest updates
KCR Announcement
KCR Padayatra
KCR Fires
KCR Comments
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Ready for campaign By KCR

YOU MAY LIKE