ధోనిని తప్పించడం వెనుక కారణం ఏంటి..?

Submitted by venkateshgullapally on Sat, 10/27/2018 - 15:31
ధోనిని తప్పించడం వెనుక కారణం ఏంటి..?

ఇంగ్లాండ్ సీరీస్ లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన లేదు.. సఫారి సీరీస్ లోను అదే పరిస్థితి.. ఆసియా కప్ లోను అదే పరిస్థితి.. టెస్ట్ ఆట తీరే గాని భారి షాట్ లు ఆడిన సందర్భం ఒక్కటి కూడా లేదు. విండీస్ తో జరిగిన రెండో వన్డేలో బ్యాటింగ్ అవకాశం వచ్చినా ఆకట్టుకోలేకపోయాడు. అతనే టీం ఇండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని. దీనితో అతనిని విండీస్ తో ఆసిస్ తో జరగబోయే మ్యాచ్ లకు దూరం పెట్టారు. తాజాగా ప్రకటించిన మూడు సీరీస్ లకు సంబంధించిన జట్లలో ధోని పేరు లేదు. యువ ఆటగాడు రిశాబ్ పంత్ మెరుపులతో అతనిపై నమ్మకం పెరిగింది. ఈ నేపధ్యంలో ధోనిని తప్పించడం వెనుక అనేక కారణాలు వినపడుతున్నాయి. అతను ఫాంని తిరిగి తెచ్చుకోవడానికి శిక్షణ తీసుకుంటాడని కొందరు అంటుంటే మరికొందరు అతని కెరీర్ అయిపోయిందని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా టీం ఇండియాకి రెండు ప్రపంచకప్ లు అందించిన హీరోగా పేరున్న ధోనికి ఈ పరిస్థితి రావడం అతని అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.

mahendra sing dhoni
team india
rishab pant
reason behind team with out dhoni

YOU MAY LIKE