పంత్ ని పడగోడుతున్న కంగారు..

Submitted by venkateshgullapally on Sun, 11/25/2018 - 17:35
పంత్ ని పడగోడుతున్న కంగారు..

అతనో చిచ్చర పిడుగు.. ఎలాంటి బంతిని అయినా శిక్షించే నేర్పు అతని సొంతం.. కాని ప్రతి బంతిని శిక్షించాలనుకుంటున్నాడు.. ఒత్తిడిలోకి వెళ్ళిపోతున్నాడు. అనవసర షాట్లు ఆడేస్తున్నాడు.. ఫుట్ వర్క్ బాగున్నా కంగారుతో వికెట్ చేజార్చుకుంటున్నాడు. అతనే యువ ఆటగాడు రిషబ్ పంత్.. ఆసిస్ తో జరిగిన మొదటి టి20లో పంత్ అవుటవకుండా ఉంటె మ్యాచ్ టీం ఇండియా గెలిచి ఉండేది..

సోషల్ మీడియాలో కూడా అభిమానులు ఇదే అభిప్రాయం చెప్పారు. అనవసరంగా వినూత్న షాట్ ఆడాలని భావించి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీనిపై తీవ్ర విమర్శలు రాకపోయినా మోస్తారుగా విమర్శలు వచ్చాయి. భారి షాట్లు ఆడే సామర్ధ్యం ఉన్నా ఒత్తిడిలో బంతిని అంచనా వెయ్యాలి అంటూ అతనికి పలువురు సూచనలు చేస్తున్నారు. ప్రతి బంతికి పరుగు చెయ్యాలి అనే ఆలోచనలోనే ఉంటాడు పంత్.. దీనితో అతను వికెట్ ని చేజార్చుకుంటున్నాడు.

రెండో మ్యాచ్ రద్దైంది.. మూడో మ్యాచ్ లో కీలక సమయంలో బ్యాటింగ్ కి వచ్చి తొలి బంతికే అనవసర షాట్ ఆడి వికెట్ చేజార్చుకున్నాడు. ప్రతిభ ఉన్నా సరే ఆ కంగారుతోనే వికెట్ కోల్పోయి విమర్శలు పాలవుతున్నాడు. అతని వయసు 21.. ఇంకా దాదాపు 15 ఏళ్ళకు పైగా కెరీర్ ఉంది కాబట్టి ప్రత్యేక శిక్షణ ఉంటె అతని కెరీర్ ఊపందుకుంటుందని.. టీం ఇండియాకి మరో గిల్ క్రిస్ట్ అవుతాడని అంటున్నారు. కాగా ఆసిస్ తో జరిగిన మూడో మ్యాచ్ లో టీం ఇండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

rishab pant
team india
MATCH
rishab panth failure with pressure

YOU MAY LIKE