ఈమెగా నటించేది ఆమె..

Submitted by venkateshgullapally on Mon, 11/05/2018 - 16:25
ఈమెగా నటించేది ఆమె..

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మి పార్వతి ఆయన జీవితంలోకి వచ్చిన నాటి నుంచి జరిగే పరిణామాలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఇటీవల తిరుపతిలో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన వర్మ త్వరలో షూటింగ్ కూడా మొదలుపెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య లక్ష్మి పార్వతిగా ఎవరు నటిస్తారు అనేది ఆసక్తిగా మారింది. లక్ష్మీపార్వతి పాత్రలో మోడల్‌ రుపాలి సూరిని వర్మ ఎంపిక చేసారని సమాచారం. ‘డ్యాడ్‌, హోల్డ్‌ మై హ్యాండ్‌’ అనే హాలీవుడ్‌ చిత్రంలో నటించిన ఈమె లక్ష్మి పార్వతిగా బాగుంటుందని వర్మ భావిస్తున్నారట. అయితే ఎన్టీఆర్ ఎవరు అనేది మాత్రం తెలియలేదు.

lakshmi parvathi
rupali suri
RGV
rupali suri as lakshmi parvathi

YOU MAY LIKE