వివాదాలలో సర్కార్...

Submitted by ganesh on Thu, 11/08/2018 - 14:51
వివాదాలలో సర్కార్...

                     కొలీవుడ్ లో రిసెంట్ గా రిలీజ్ అయిన... సర్కార్ మూవిని ఏ మూహూర్తన ప్రారంభించారో గాని ఇప్పుడు  రక రకాల వివాదాలకు సెంటర్ ఆఫ్  ఎట్రాక్షన్ గా మారింది. ఇప్పటికే కాపీ కథ తో ఓ వివిదం ఈ ఫీల్మ్ టీంకి  షాక్ ఇస్తే ఇప్పుడు ఈ సినిమాలో  వరలక్ష్మి చేసిన  కోమలవల్లి పాత్ర జయలలిత క్యారెక్టర్ ని పొలి ఉందని ...విటినే వెంటనే డిలిట్ చేయలని  తమిళ్ ప్రభుత్వం అల్టీమేటమ్ జారి చేసింది.దింతో  అరవ అడ్డలో సర్కార్ పరిస్దితి ఇరకాటంలో పడింది.ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియని దుస్దితి కనిపిస్తోంది.

                    తమిళ స్టార్ హీరో విజయ్ చిత్రాలు వివాదాలు లేకుండా రిలీజ్  కావేమో.ఇప్పటికే సర్కార్ సినిమా కాపీ కథ అంటూ ఓ వివాదం షాక్ ఇస్తే ....ఇప్పుడు సర్కార్ చిత్రం పై రాజకీయ రగడ పీక్స్ కి చెరింది. మెర్సల్ చిత్రాన్ని మించే వివాదాలతో సర్కార్ సంక్షోభం దిశగా సాగుతోంది. మెర్సల్ సినిమాలో కేంద్ర ప్రభుత్వం పై వేసిన సెటైర్లు అప్పట్లో జాతీయస్థాయిలో హట్ టాపీక్ అయితే  సర్కార్ సినిమాలో ప్రతినాయకిగా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర తమిల్ పోలిటిక్స్ లో సెగలు రేపుతోంది.

                     ప్రజంట్ ఉన్న సమజంలో ఓటు హక్కు ఎలా దుర్వినియోగం అవుతుందో ఉత్కంఠ భరితమైన పొలిటికల్ కథతో అద్భుతంగా చూపించాడు డైరెక్టర్.ఇదే ఇప్పుడు మురుగదాస్ కి షాక్ ఇస్తోంది..ఇందులో ముఖ్యమంత్రి కుమార్తెగా ఎత్తుకు పైఎత్తు వేసే కోమలవల్లి పాత్రలో వరలక్ష్మి అద్భుతంగా నటించింది. కానీ ఆమె పాత్ర దివంగత ముఖ్యమంత్రి జయలలితని తప్పుగా చూపించే విధంగా ఉందని తమిళ్ ప్రభుత్వం భావిస్తోంది. జయలలిత ప్రవేశ పెట్టిన ఉచిత పథకాలపై కూడా ఈ సినిమాలో సెటైర్లు పడ్డాయి. ఇక జయలలిత అసలు పేరు కూడా కోమలవల్లే. పతాక సన్నివేశాల్లోకోమలవల్లి వేషధారణ అంతా జయలలితని పోలిన విధంగా ఉంటుంది. దింతో కోమలవల్లి వివాదాస్పద సన్నివేశాల్ని వేంటనే తొలగించాలని హెచ్చరిస్తున్నారు  అన్నా డీఎంకే మంత్రులు . లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవు అని అల్టీమేటమ్ కూడా జారి చేసారు.

                       మొత్తనికి విజయ్ లాంటి స్టార్ హీరో ఇలాంటి వివాదాస్పద చిత్రాలు చేయడం అవసరమా అంటూ ఒక వర్గం ట్రోలింగ్ చేస్తుంటే కేవలం హీరో విజయ్ కి మాత్రమే కాదు.. సామాన్య పౌరుడికి సైతం ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంది అంటూ మరో వర్గం వాదిస్తోంది.మొత్తనికి సర్కార్ చిత్రం హింసని ప్రేరేపించే విధంగా ఉందని ...ప్రభుత్వ  పదకాలను రాంగ్ వేలో ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చేస్తున్నరని..అందుకే ఈ చిత్రంలో భాగమైన ప్రతిఒక్కరిపై కేసులు పెడతామని తమిళ్ నాయ్య శాఖ మంత్రి హెచ్చరించారు. దీంతో సర్కార్ వివాదం ఏ మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ అరవ అడ్డలో హట్ టాపిక్ గా మారింది.

Sarkar
vijay
Sarkar Movie
Vijay new Movie
Sarkar News
Sarkar Breakings
Sarkar Breaking News
Sarkar Update News
Vijay Update News
Vijay Latests
Vijay Latest Updates
AP24x7
AP24x7 Update News
Sarkar Movie In controversy

YOU MAY LIKE