కోహ్లిని అవుట్ చేసి పాపులర్ అయిపోయాడు

Submitted by venkateshgullapally on Mon, 11/26/2018 - 18:35
కోహ్లిని అవుట్ చేసి పాపులర్ అయిపోయాడు

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వికెట్ దక్కితే చాలు సంబరపడిపోతూ ఉంటారు బౌలర్లు. ఆయన వికెట్ తీస్తే చాలు మ్యాచ్ లో సగం విజయం సాధించినట్టే అని భావిస్తూ ఉంటారు. ఎలాంటి పిచ్ అయినా సరే పరుగులు తీయడమే లక్ష్యంగా ఆడుతూ ఉంటాడు, అతనిని అవుట్ చెయ్యడం అంటే మాటలు కాదు.. కాని ఒక సెక్యురిటి గార్డ్ కోహ్లిని అవుట్ చేసాడు. 17వ ఓవర్‌లో కోహ్లీ బంతిని మిడ్‌వికెట్‌ మీదుగా బౌండరీకి తరలించగా అది సిక్స్ అయింది.

కోహ్లీ మరో సిక్స్‌ బాదాడని టీమిండియా అభిమానులు సంబరాలు చేసుకుంటున్న సమయంలో.. ఆ బంతిని సరిగ్గా ఒడిసి పట్టుకున్నాడు.. విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్‌. కోహ్లీనే ఔట్‌ చేశావంటూ పలువురు అభిమానులు అతనికి అభినందనలు తెలుపుతూ  సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ‘సెక్యూర్ హ్యాండ్స్‌! విరాట్ కోహ్లీ షాట్ అద్భుతం. కానీ ఈ సెక్యూరిటీ గార్డ్ ప్లేయర్‌ ఆఫ్‌ ది డేను సొంతం చేసుకున్నాడు’ అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

team india
Virat Kohli
six
social media
security guard taken catch of virat kohli

YOU MAY LIKE