కాంగ్రెస్ కి షాక్

Submitted by venkateshgullapally on Mon, 11/05/2018 - 16:38
కాంగ్రెస్ కి షాక్

త్వరలో ఎన్నికలు జరగబోయే ఈశాన్య రాష్ట్రం మిజోరంలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత. అసెంబ్లీ స్పీకర్‌ హైపీ తన పదవికి, పార్టీకి  సోమవారం రాజీనామా చేసారు. గత కొన్ని రోజులుగా ఆయన కాంగ్రెస్ ని వీడి బీజేపిలో చేరతారని ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో తన రాజీనామా పత్రాన్ని సోమవారం డిప్యూటీ స్పీకర్‌ ఆర్‌ లాల్‌రినామాకు సమర్పించారు. కాంగ్రెస్‌ పార్టీని కూడా వీడుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పిన ఆయన త్వరలోనే తాను భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు కూడా స్పష్టం చేసారు. నవంబరు 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని సర్వేలు కూడా చెప్తున్న సమయంలో ఆ పార్టీకి షాక్ తగిలింది. త్వరలోనే మరికొందరు నేతలు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి.

congress party
shock
November
Survey
shock to congress

YOU MAY LIKE