నా పాట ఎందుకు వాడారు..?

Submitted by venkateshgullapally on Mon, 11/05/2018 - 16:40
నా పాట ఎందుకు వాడారు..?

అమెరికాలో మరో సింగర్ ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి షాక్ ఇచ్చారు. కొద్ది రోజుల్లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో టెన్నెస్సేలోని చట్టానూగ ప్రాంతంలో నిర్వహించిన ర్యాలీలో పాప్‌ గాయని రిహానా పాడిన ‘డోన్ట్‌ స్టాప్‌ ది మ్యూజిక్‌’ పాటను ప్రసారం చేశారు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు కూడా జారి చేసారు. ట్రంప్‌నకు చెందిన వర్గాలకు కూడా నోటీసులు జారీ చేసిన ఆమె ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ కూడా చేసారు. ఇలాంటి బాధాకర ర్యాలీల్లో నేను కానీ, నా అభిమానుల కానీ పాల్గొనరు. ట్రంప్‌..మీ ర్యాలీల్లో నా పాటలేంటి?’ అని ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే పిట్స్‌బర్గ్‌లోని సైనగాగ్‌లో కాల్పులు జరిగిన కొద్దిగంటల తర్వాత ఇల్లినాయిస్‌లో జరిగిన ర్యాలీలో ప్రముఖ గాయకుడు విలియమ్‌ ఫారెల్‌ పాడిన ‘హ్యాపీ’ పాటను ప్రసారం చేయడంతో ఆయన ట్రంప్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు.

Donald Trump
america
singer
President
shock
singer gave a shock to trump

YOU MAY LIKE