భూముల కుంభకోణం వ్యవహారంపై సిట్ నివేదిక

Submitted by ganesh on Thu, 11/08/2018 - 21:02
భూముల కుంభకోణం వ్యవహారంపై సిట్ నివేదిక

                     విశాఖపట్టణంతో యావత్ రాష్ర్టంలో సంచలనం సృష్టించిన  భూముల కుంభకోణం వ్యవహారంపై సిట్ నివేదిక ప్రభుత్వానికి అందింది.   మంగళవారం జరిగిన  ఏపీ కేబినెట్ సమావేశంలో నివేదిక కేబినెట్ ముందుకొచ్చింది.  విశాఖ భూముల అవకతవకల్లో కొందరు ఐఏఎస్ లు, గ్రేడ్-1 అధికారుల హస్తముందని, కొందరు రాజకీయనాయకులు, మాజీ మంత్రి ప్రమేయం కూడా ఉందని ఈ నివేదికలో స్పష్టం చేసింది. ఈ నివేదికలో వైసీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరును పేర్కొన్నట్టు సమాచారం. ధర్మాన తనయుడి పేరిట ఉన్న భూముల పైనా సిట్ విచారణ జరిపినట్టు ప్రచారం జరుగుతోంది.

                     గతంలో విశాఖ జిల్లాలో పనిచేసిన ముగ్గురు కలెక్టర్లు, నలుగురు జాయింట్ కలెక్టర్లపై అభియోగాలు ఉన్నాయి. సిట్ నివేదికలో 10 మంది  జిల్లా రెవెన్యూ అధికారులు, 14 మంది ఆర్డీవోల పేర్లు ఉన్నాయని తెలుస్తోంది.   100 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని, శాఖపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని, కొందరు అధికారులను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని సిట్ అధికారులు నివేదికలో పేర్కొన్నట్టు లీకులు వస్తున్నాయి.

                         విశాఖలో వెలుగు చూసిన భూ కుంభకోణం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ స్కాంపై విచారణను సిట్ కు అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన సిట్ విశాఖలో గత 15 ఏళ్లుగా జరిగిన భూ లావాదేవీలపై లోతుగా విచారణ జరిపింది. అయితే సిట్ విచారణ పూర్తయినా రిపోర్ట్  సమర్పించడం లేదంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో హఠాత్తుగా సిట్ మంగళవారం కేబినెట్ లో నివేదిక సమర్పించడం సంచలనం రేకెత్తించింది. ఆరు నెలలుగా సిట్ రిపోర్ట్ ను దాచిన  సర్కారు  ఇప్పుడు లీకులు ఇవ్వడం వెనుక రాజకీయ కుట్ర ఉందంటున్నాయి విపక్షాలు.

                            భూకుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావుకు సంబంధం లేదని సిట్ తేల్చేసిందని ప్రచారం జరుగుతోంది. తనకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందంటూ మంత్రి గంటా కూడా  ఆనందం వ్యక్తం చేసారు.  తనకేపాపం తెలీదని , సిట్ నివేదికలో అన్ని విషయాలు బయటపడతాయని గంటా శ్రీనివాసరావు  వ్యాఖ్యానించారు. .

                           భూ కుంభకోణంతో మంత్రి గంటా శ్రీనివాస్ కు ఎలాంటి ప్రమేయం లేదంటూనే...మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరును ఈ నివేదికలో ప్రస్తావించినట్లు  లీకులివ్వడం వెనుక కుట్ర ఉందని  వైసిపి ఆరోపిస్తోంది.  గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ధర్మాన తో పాటు ఆయన కుమారుడి పేరు మీద ఉన్న భూములపైనా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సిట్ నివేదిక చర్చనీయాంశంగా మారిందిలీకులు...ఆరోపణలు సంగతి ఎలా ఉన్నా..సమగ్ర సిట్ రిపోర్ట్ బయటకొస్తే.. అసలు దొంగలు ఎవరు..సూత్రధారులు ఎవరు.? పాత్రదారులెవరు అనేది తేలిపోనుంది.

Ganta
ganta srinivas rao
Ganta Srinivas Rao News
Ganta Srinivas Rao Breakings
Ganta Srinivas Rao Breaking Updates
Ganta Srinivas Rao Update News
Ganta Srinivas Rao News Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Sit report on land scam case

YOU MAY LIKE