అభిమానులకు సర్ప్రైజ్

Submitted by venkateshgullapally on Mon, 11/05/2018 - 16:24
అభిమానులకు సర్ప్రైజ్

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఓ మల్టీస్టారర్‌ చిత్రం వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ‘RRR’ పేరును వర్కింగ్‌ టైటిల్‌గా పెట్టిన ఈ చిత్రాన్ని నవంబర్‌ 11న ఉదయం 11 గంటలకు ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఇటీవల రాజమౌళి ప్రకటించిన నేపధ్యంలో సినిమాపై అంచనాలు భారిగా పెరిగాయి. 1920 నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఇక సినిమా ప్రారంభ కార్యక్రమానికి యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ అతిథిగా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

RAJAMOULI
ntr
title
RAMCHARAN
movie
surprise to fans

YOU MAY LIKE