ఎన్నికల్లో ఘోరం.. అభ్యర్ధి హత్య

Submitted by venkateshgullapally on Wed, 10/17/2018 - 17:25
ఎన్నికల్లో ఘోరం.. అభ్యర్ధి హత్య

పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ఆఫీసు కుర్చీకింద బాంబుపెట్టి తాలిబాన్ ఉగ్రవాదులు హత్య చేసిన ఘటన ఆఫ్ఘనిస్తాన్‌లోని దక్షిణ ప్రావిన్స్ హెల్మండ్‌లో చోటుచేసుకుంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం  శనివారం జరిగే పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమైన అబ్దుల్ జబర్ ఖహ్రామన్ ఈ దాడిలో మృతిచెందినట్లు పేర్కొన్నారు.

అలాగే ఈ ఘటనలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలైనట్టు అధికారులు మీడియాకు తెలిపారు. దీనిపై స్పందించిన ఉగ్రవాదులు ఖహ్రామన్‌పై దాడి తమ పనేనని, పార్లమెంటరీ ఎన్నికలను ఆఫ్ఘాన్ ప్రజలు బహిష్కరించాలని పేర్కొన్న ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసారు. అయితే ఈ ఘటనపై అక్కడి స్థానిక మీడియా వద్ద ఆధారాలు ఉన్నా ప్రసారం చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.

afghanisthan
pakistha
media
ELECTIONS
bomb
taliban kills jabar kahraman

YOU MAY LIKE