వాళ్ళు వచ్చేసారు

Submitted by venkateshgullapally on Thu, 10/25/2018 - 19:37
వాళ్ళు వచ్చేసారు

విండీస్ తో జరుగుతున్న 5 వన్డేల సీరీస్ లో టీం ఇండియా దూసుకుపోతుంది. తొలి వన్డేలో టీమిండియా భారీ విజయం సాధించింది. ఇక రెండో వన్డేలో హోరాహోరీగా సాగిన పోరు చివరి వరకు ఉత్కంఠను రేకెత్తించి టైగా ముగిసింది. టాప్ ఆర్డర్ రాణించడంతో విజయం దిశగా దూసుకుపోతుంది టీం ఇండియా. ప్రధానంగా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ వన్డేల్లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేస్తున్నారు. ధావన్ విఫలమైనా రోహిత్ మొదటి వన్డేలో భారి సెంచరి సాధించాడు. ఇక రెండో వన్డేలో కోహ్లి రాయుడు రాణించి టీం స్కోర్ 300 దాటించారు. అయితే వెస్టిండీస్‌తో మిగిలిన మూడు వన్డేలకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.  సీనియర్‌ పేసర్లు భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రాను ఎంపిక చేశారు.

భారత జట్టు: విరాట్‌ కోహ్లీ (సారథి), రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌, అంబటి రాయుడు, రిషబ్‌ పంత్‌, ఎంఎస్‌ ధోనీ, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, యజువేంద్ర చాహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ఖలీల్‌ అహ్మద్‌, ఉమేశ్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌, మనీశ్‌ పాండే.

team india
Virat Kohli
manish pandey
team score
umesh yadav
team for 3rd today

YOU MAY LIKE