మైనర్ బాలిక పై అత్యాచారం

Submitted by Likhitha on Thu, 11/08/2018 - 14:07
మైనర్ బాలిక పై అత్యాచారం

                        కోన సీమలో మైనర్ బాలిక పై అత్యాచారం. తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో దారుణ ఘటన చేటుచేసుకుంది. లంక గ్రామానికి చెందిన15 ఏళ్ల బాలిక వందే సంధ్య ముమ్మిడివరం మండలం తానేలంక  గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. దీపావళి రోజున కుటుంబ సభ్యులతో గడుపాలని ఇంటికి వచ్చిన సంధ్య పై స్థానికంగా నివసించే ముత్తబత్తుల సతీష్,కొల్లాటి వర్మ అనే యువకుల కన్ను పడింది. ఎవరికివారు దీపావళి హడావిడిలో ఉండగా చుట్టూప్రక్కల ఎవరు లేని సందర్భంలో ప్లాన్ ప్రకారం రాత్రి 8.30 ప్రాంతంలో ఇంటి బయట ఉన్న బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అనుకున్న పధకం ప్రకారం పక్కక్కు తీసుకువెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలిక వాంగ్మూలం ప్రకారం పోలీసులు రంగంలోకి దిగారు. అఘాయిత్యానికి పాల్పడ్డ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. బాలిక కుటుంబ సభ్యులు తమ చిన్నారికి జరిగిన సంఘటనతో కన్నిరు మున్నీరవుతున్నారు. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ యువకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ కేసు నమోదు చేయగా... అమలాపురం రూరల్ సిఐ జి. దేవకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

East Godavari district
Ainavilli
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
Thugs Spoil Child Girl Life in Ainavilli Lanka

YOU MAY LIKE