కొత్త సినిమా శ్రీకారం చుట్టిన వెంకీ...

Submitted by ganesh on Mon, 11/05/2018 - 15:09
కొత్త సినిమా శ్రీకారం చుట్టిన వెంకీ...

                        విక్టరి వెంకటేష్...టాలీవుడ్ లో స్లో అండ్ స్టాడిగా సినిమాలు చేస్తున్న హీరో. మొన్న గురు అంటే ...సింగిల్ హిట్ ఎకౌంట్ లో పడింది. కాని తర్వత తన సందడి లేదు.నిన్నటి వరకు తన ప్రాజెక్ట్ మాటే వినిపించలేదు.కట్ చేస్తే ఇప్పుడు రెండు మల్టీస్టారర్ మూవితో బిజి అయ్యాడు.అల్ రెడీ సెట్స్ పైకి తీసుకువెళ్లాడు.ఇంత వరకు ఓకే...కాని వెంకి సోలో హీరోగా సినిమాలు చేయడానికి పులుస్టాప్ పెట్టేసాడా?.ప్రజంట్ ఫీల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

                        టాలీవుడ్  వెంకటేష్ సినిమా వచ్చి వన్ ఇయర్ అయింది.ఇప్పటి వరకు మరో కొత్త సినిమా థీయోటర్స్ లో దిగాలేదు.ప్రజంట్ రెండు మల్టీస్టారర్ సినిమాలు లైన్ లో పెట్టిన సోలో హీరోగా వెంకి సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్ళుతుందో తెలియని దుస్దితి.కారణం మొన్న తేజ తో ఒక సినిమా అన్నడు...కట్ చేస్తే అది సైడ్ అయిపోయింది.నిన్న త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని బ్యానర్లో  ఒక సినిమా అన్నారు ....అది కూడా అల్ మోస్ట్ లేనట్టే తెలుస్తోంది.దింతో సోలో హీరోగా వెంకీ సినిమా ఇప్పట్లో ఉండదనే టాక్ గట్టిగా ఊపందుకుంది.కట్ చేస్తే త్వరలో వెంకి ఓ సోలో మూవి చేయబోతున్నడని సమచారం.

                        'నేను లోకల్' ఫేమ్ దర్శకుడు త్రినాధ రావు నక్కిన రీసెంట్ గా వెంకీకి ఓ ఇంట్రెస్టింగ్ కథ వినిపించాడట. కథ దగ్గుబాటి హీరోకి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇది సోలో హీరో కథ అని.. ఈ కథకు మరో హీరో అవసరం లేదని సమాచారం. దీంతో వరసగా మల్టీస్టారర్ సినిమాలకు పచ్చజెండా ఊపుతున్న వెంకీ సోలో హీరో గా ఆడియన్స్ ను మెప్పించేందుకు రెడీ అయినట్టే. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకీ అన్నయ్య  సురేష్ బాబు నిర్మించబోతున్నడట.

                        మొత్తనికి వెంకీ ప్రజంట్ వరుణ్ తేజ్ తో కలిసి 'F2' అనే మల్టిస్టారర్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాబీ డైరెక్షన్ లో మరో మల్టిస్టారర్ 'వెంకీమామ' లైన్లో ఉంది.  ఈ సినిమాలో వెంకీ - నాగ చైతన్య కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా తర్వలో సెట్స్ మీదకు వెళ్ళనుంది.  ఈ సినిమాతో పాటుగా త్రినాధరావు నక్కిన ప్రాజెక్టును కూడా ఒకెసారి సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని వెంకీ ప్లాన్ చేస్తున్నాడట.అన్ని అనుకున్నట్టు కుదిరితే ఈ మూడు సినిమాలు 2019లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.మొత్తనికి నిన్నటి వరకు లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకి 2019లో 3 సినిమాలతో రాబోతున్నాడు.మరి ఈ మూడు సినిమాలు తన కెరిర్ కి ఎలాంటి బుస్ట్ ఇస్తాయో వెచి చూడాల్సిందే.

Venkatesh
Venkatesh Babu
Venkatesh News
Venkatesh Breakings
Venkatesh Breaking Updates
Venkatesh Updates
Venkatesh Update News
AP24x7
AP24x7 news
AP24x7 Breakings
ap24x7 breaking news
Venky Started New Movie

YOU MAY LIKE