ఆ పక్షులకు ఈ గ్రామమన్నా...

Submitted by ganesh on Fri, 11/23/2018 - 13:41
ఆ పక్షులకు ఈ గ్రామమన్నా...

                        విదేశీ అందాల పక్షులు వచ్చేశాయి. ఎల్లలు దాటుకుంటూ... దేశ సరిహద్దులు చెరిపేసుకుంటూ తరతరాలుగా తమకు బాసటగా నిలుస్తున్న ఆ గ్రామానికి వచ్చేశాయి. కొన్ని ఏళ్ళుగా ఆ కుగ్రామం తమకు సురక్షిత, ఆవాస ప్రాంతమని నమ్ముకున్నపక్షులు వచ్చేశాయి. వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ... తమ పుట్టింటికి వచ్చి వాలిపోయాయ్.

                         సైబీరియన్ పక్షులుగా పిలుచుకొనే పక్షుల సందడితో... తూర్పుగోదావరి జిల్లా పుణ్యక్షేత్రం గ్రామం కోలాహలంగా మారిపోయింది. ఎక్కడి నుంచి వస్తాయో సరిగా ఎవరికీ తెలియదు కానీ... ఖచ్చితంగా వాటి పుట్టుకకు కారణమైన పుణ్యక్షేత్రం గ్రామానికి మాత్రం చేరుకున్నాయి. 

                         తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని పణ్యక్షేత్రం గ్రామమిది. మారుమూల ఉండే ఈ గ్రామం పేరు వింటే చాలు... సైబీరియన్ పక్షులే గుర్తుకు వస్తాయి. ప్రతియేటా క్రమం తప్పకుండా వచ్చే వేలాది పక్షులకు ఇది ఒక రకంగా పుట్టినిల్లు అని చెప్పుకోవచ్చు. వాటికి ఈ గ్రామంతో ఉన్న అవినాభ సంబంధం ఏమిటో కానీ... వందల పక్షలు సమూహంగా ఆకాశవీధుల్లో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడకు చేరుకుంటాయి. ఆరు నెలల పాటు ఇక్కడే గడుపుతాయి. ఈ ప్రాంతంలోనే ఆహారాన్ని సమకూర్చుకొని జీవనం సాగిస్తూ....  పిల్లల్ని పుట్టిస్తాయి.  ఆ తర్వాత తిరిగి తమ ప్రాంతానాకి రెట్టింపు సంఖ్యలో పిల్లలను తీసుకొని తిరిగి వెళుతూంటాయి.

                         తాము ఇక్కడికి రావలసిన సమయం ఆసన్నమైనపప్పుడు నాలుగైదు పక్షులు మాత్రమే వస్తాయి. ఇక్కడి వాతావరణ  పరిస్ధితులు అన్నీ గమనించి అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది తరచి చూసుకొని తిరిగి వెళతాయి. ఆ తర్వాత ఒక వారం పది రోజులకు వేలాది పక్షులు ఇక్కడకు చేరుకుంటాయి. ఇక్కడ తమ సంతాన వృద్ధికి, పోషణకు సురక్షిత ప్రాంతంగా నమ్మకం కలగడం వల్లే... ఎన్నో అడవులు, వృక్ష సంపద కలిగిన గ్రామాలు ఉన్నప్పటికీ... వాటన్నింటినీ దాటుకొని పుణ్యక్షేత్రం గ్రామానికి చేరుకుంటాయి.  ఈ గ్రామంతో సైబీరియన్ పక్షులు శాశ్వత బంధాన్ని పెంచుకున్నాయని ఇక్కడి ప్రజలు మురిసిపోతుంటాయి.

                           వలస వచ్చిన సైబీరియన్ పక్షులు ఇక్కడే గుడ్లు పెట్టి... ఇక్కడే పొదుగుతాయి. పిల్లల్ని పుట్టించి వాటిని పెద్దవి చేస్తాయి. రెక్కలపై ఎగిరే శక్తి వచ్చిన వెంటనే... పుట్టినింటికి వీడ్కోలు పలికి భారంగా తమ అత్తారింటికి కదిలి వెళ్తాయి. మళ్ళీ వచ్చే ఏడాది తిరిగి యధావిధిగా పుణ్యక్షేత్రం గ్రామానికి చేరుకుంటాయి.

                       పొడగాటి ముక్కుతో... తెల్లని మేని రంగుతో అక్కడక్కడా నల్లని మచ్చలతో  చూడముచ్చటగా ఉండే ఈ పక్షులు... వేల కిలోమీటర్ల దూరం నుంచి ఖచ్చితంగా ఇక్కడికి ఎలా వస్తాయి.... ఎందుకొస్తాయి ? అన్న ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికీ దొరకలేదు. కానీ క్రమం తప్పకుండా వచ్చి తీరుతాయి. తమ ఆవాసానికి ఈ ప్రాంతమే  సరియైనదని వస్తున్న పక్షులను అక్కడి ప్రజలు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. పక్షులు వలస వచ్చే సమయం ఆసన్నమైందంటే చాలు పక్షి అతిధుల కోసం గ్రామం మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూంటే... వీటికున్న ప్రత్యేకత, వీటిపట్ల  ఆ గ్రామస్తులకున్న ఆదరణ ఎటువంటిదో అర్ధమౌతుంది. రూట్ మ్యాప్ వీటికెలా గుర్తు ఉంటుందో కానీ... ఖచ్చితంగా ఒకే సమయానికి... అదే గ్రామానికి ఎలా వస్తాయన్నది అంతు పట్టని ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ పక్షుల వలస అనేది తరతరాలుగా ఇక్కడ జరుగుతున్న అద్భుతమైన ఘట్టం.

                            ఎలా వస్తేనేం... సైబీరియన్ పక్షుల రాక కారణంగా మారుమూలన ఉన్న పుణ్యక్షేత్రం గ్రామానికి రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. అతిధి పక్షుల కారణంగా తమ గ్రామానికి వస్తున్న ప్రాచరుర్యాన్ని కలకాలం కాపాడుకోవాలనుకుంటున్నారు గ్రామస్తులు. అందుకే వేటగాళ్ళ నుంచి... ఆకతాయిల నుంచి వీటికి రక్షణ కల్పిస్తుంటారు. పక్షులు వస్తే చాలు... సంబరాలు చేసుకొని.... పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డను చూసుకున్నట్లు చూసుకుంటూ ఉంటారు గ్రామస్తులు. తిరిగి ఆరు నెలల తరువాత తమ సంతతిని వృద్ధి చేసుకొని తిరిగి వెళుతున్నప్పుడు అశ్రునయనాలతో గ్రామస్తులు వీడ్కోలు పలుకుతుంటారు.

                          ఇంత అద్భుతమైన పక్షి సంపదకు మానవ ప్రయోగాలు నష్టాన్ని కలుగచేస్తున్నాయి. ఇక్కడ ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలు, టవర్ల కారణంగా వీటి సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోంది. దీనికి తోడు వేటగాళ్ల బెడదా ఎక్కువైంది. వేటగాళ్ళు వీటికి హాని తలపెట్టినట్లు  తెలిస్తే మాత్రం గ్రామస్తులు కఠినంగా శిక్షిస్తున్నారు. మరోవైపు సైబీరియన్ పక్షుల్ని వీక్షించేందుకు చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. పర్యాటకంగా వీటికి సరైన వసతులు కల్పిస్తే... వాటి సంఖ్య మరింత పెరగనుంది. సైబీరియన్ పక్షుల సంరక్షణ కోసం... ఇక్కడి పర్యావరణం దెబ్బతినకుండా ఉండేందుకు ప్రజలు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. మానవ సంబంధాలు మసకబారుతున్న  తరుణంలో.... తరతరాల బంధంతో పుణ్యక్షేత్రం గ్రామానికి వస్తున్న ఈ పక్షి సంపదను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

Bird
Bird News
Bird Updates
Bird Update News
Bird Breaking Update news
Bird Latests
Bird Latest News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Is This Village Is For Girls

YOU MAY LIKE