మేము అందుకే ఓడిపోయాం

Submitted by venkateshgullapally on Sun, 10/28/2018 - 19:39
మేము అందుకే ఓడిపోయాం

5 వన్డేల సీరీస్ లో భాగంగా పూణే వేదికగా విండీస్ తో జరిగిన మూడో వన్డేలో టీం ఇండియా ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్. ఒక్క కోహ్లి మినహా మరొక ఆటగాడు చెప్పుకోదగిన స్కోర్ చేయలేదు. దీనిపై కోహ్లి అసహనం వ్యక్తం చేసాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ విండీస్ నిర్దేశించిన లక్ష్యం ఛేదించదగ్గదే అని, అయితే విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలం కావడమే తమ ఓటమికి కారణమని,

బౌలర్లు చివరి పది ఓవర్లలో పరుగులు ఎక్కువగా సమర్పించుకోవడమే తమ కొంప ముంచిందన్నాడు. 35 ఓవర్ల వరకు విండీస్‌ను కట్టడి చేశామని, అయితే.. ఆ తర్వాత విఫలం కావడంతో 260లోపు ఉండాల్సిన లక్ష్యం కాస్తా 284 పరుగులకు చేరుకుందన్నాడు. తమదైన రోజున ఎటువంటి జట్టునైనా ఓడించగదని విండీస్ మరోమారు నిరూపించిందన్నాడు. విజయం సాధించడానికి అవసరమైన ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమైన కారణంగా ఓటమిపాలైనట్టు వివరించాడు.

Virat Kohli
oneday
midil order
team india
virat kohli about 3rd oneday

YOU MAY LIKE