ధోనికి అండగా నిలిచిన మాజీ ఆటగాడు

Submitted by venkateshgullapally on Sat, 11/24/2018 - 18:28
ధోనికి అండగా నిలిచిన మాజీ ఆటగాడు

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు ఫాం లేక నానా అవస్థలు పడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో గత రెండేళ్లుగా ధోని ఆడిన ఒక గొప్ప ఇన్నింగ్స్ కూడా లేదు. ఒత్తిడిలో కూరుకుపోయాడు. దీనితో అతనిపై మాజీ ఆటగాళ్ళు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గంగూలీ అయితే ఇక ధోనిని జట్టు నుంచి పంపించాలి అనే విధంగా వ్యాఖ్యలు చేసాడు. తాజాగా మాజీ దిగ్గజ ఆటగాడు వీవి ఎస్ లక్ష్మణ్ దోనికి అండగా నిలిచాడు. ఎంఎస్‌ ధోనీ ఎప్పటికీ గొప్ప ఆటగాడే. అంతర్జాతీయ క్రికెట్‌లో అతనే బెస్ట్‌ వికెట్‌కీపర్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదని, వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో  ధోనీ భారత జట్టులో కీలక పాత్ర పోషిస్తాడని అన్నాడు. ధోనీ ఫామ్‌ గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నాడు. ఈ ఏడాది ఐపియల్ తరహాలోనే వన్డే ప్రపంచకప్ లో కూడా ధోని సక్సెస్ అవుతాడని అన్నాడు.

MS Dhoni
vvs lakshman
team india
ipl
vvs lakshman support ms dhoni

YOU MAY LIKE