యుత్ థిల్ ని హామ్ ఫట్ చేసిన బ్యూటీ ఎవరో...?

Submitted by ganesh on Thu, 11/01/2018 - 15:09
యుత్ థిల్ ని హామ్ ఫట్ చేసిన బ్యూటీ ఎవరో...?

                   పాయల్ రాజ్ పూత్...టాలీవుడ్ లో ఆర్ ఎక్స్ 100 మూవితో ఎంట్రి ఇచ్చి గ్లామర్ తో ఘాటు పెంచిన లేడి. సింగిల్ సినిమాతో ట్రెండ్ బెండ్ తిసింది.యుత్ థిల్ ని హామ్ ఫట్ చేసేసింది. కాని ఇప్పటి వరకు సరైనా ఆఫర్ రాలేదు. అసాలు బడా స్టార్స్ తో జోడి కట్టే అవకాశమే  కనిపించలేదు.కట్ చేస్తే ..సడన్ గా రవితేజ మూవిలో నటించే ఛాన్స్ పట్టేసింది.మరోసారి గ్లామర్ రూట్ లో ఘాటు పెంచబోతుంది.మరి ఈసారైనా తన సీన్ మారుతుందా?.తన కటౌట్ ఫోకస్ అవుతుందా..?

                   టాలీవుడ్ లో ఆర్ ఎక్స్ 100’ మూవితో హీరోయిన్ గా ఎంట్రి ఇచ్చిన బ్యూటి  పాయల్ రాజ్ పూత్ .మొదటి సినిమాతోనే మంచి స్టార్ డంను దక్కించుకుంది. నటనతో పాటు గ్లామర్ రూట్ లోను ఘాటు పెంచడంతో  పాయల్ కు పలు ఆఫర్లు వచ్చాయి. అయితే అవన్ని  చిన్న చిత్రాలే కావ్వడం..కేవలం స్కిన్ షో కే పరిమితం అవ్వడం వల్ల వాటికి నో చెప్పింది. అయితే  తాజాగా రవితేజ మూవీలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటి.

                    నిజనికి ఆర్ ఎక్స్ 100 సినిమా విడుదలై చాలా రోజులే అయినా.... ఇప్పటి వరకు ఈమె బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీకి మాత్రమే ఓకే చెప్పింది. ఆ సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతోంది. నిన్నటి వరకు వచ్చిన చిన్న చితక ఆఫర్లు తిరష్కరించిన పాయల్ తాజాగా రవితేజ మూవీలో ఎంపిక కావడంతో మంచి బ్రేక్ దక్కినట్లయ్యింది. తెలుగులో పాయల్ కు ఇది ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంది.ఈ సినిమా హిట్ అయితే పాయల్ కి పెద్ద హీరోల మువిలో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది.

                     మొత్తనికి రవితేజ - వీఐ ఆనంద్ ల కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న చిత్రంలో ఇప్పటికే నభా నటేష్ మైయిన్  హీరోయిన్ గా ఎంపికైంది. అయితే తాజాగా మరో హీరోయిన్ గా పాయల్ ను ఎంపిక చేశాడు డైరెక్టర్.కథ లో మ్యాటర్ ఉండటంతోనే ఈ మూవికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట పాయల్. ఇక ఈ సినిమాకి  డిస్కో రాజా అనే టైటిల్ ను  పరిశీలిస్తోంది ఆ సినిమా యూనిట్. మరి ఈ సినిమా సక్సెస్ అయితే పాయల్ కెరీర్ టర్న్ అయినట్లే. మరి ఇన్నాళ్లు వేచి చూసినందుకు మంచి ఆఫర్ ను పట్టిన పాయల్ - ఈ ప్రాజెక్ట్ ని ఎంత వరకు  సద్వినియోగం చేసుకుంటుందో వెచి చూడాలి.

Payal Rajput
Payal Rajput News
Payal Rajput Breakings
Payal Rajput Brealking News
Payal Rajput Breaking Updates
Payal Rajput Update News
Payal Rajput News Updates
Payal Rajput Latest Updates
AP24x7
AP24x7 news
AP24x7 Updates
Who Is that beauty..?

YOU MAY LIKE