కాజల్ కి ఆఫర్స్ మిద ఆఫర్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి?

Submitted by ganesh on Fri, 12/07/2018 - 17:19
కాజల్ కి ఆఫర్స్ మిద ఆఫర్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి?

                  టాలీవుడ్ లో హీరో హీరోయిన్ల మధ్య ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్‌  ఉండటం సహజమే. కానీ ఒక సీనియర్‌ హీరోయిన్‌ ఒక యువ హీరోతో మరీ క్లోజ్‌గా మసలుకోవడం కొత్త రూమర్స్‌కి సెటర్ అవుతుంది. చిన్న హీరోల నుంచి చిరంజీవి వరకు అందరితో నటించేసిన కాజల్‌ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో రెండు సినిమాల్లో చేస్తోంది. అందులో మొదటి చిత్రం కవచం ఈ రోజు రిలీజ్ కాగా.... మరో చిత్రం తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పుడు ఈ జంట ముచ్చటగా మూడో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిదట. ఇదే ఇప్పుడు ఫీల్మ్ నగర్ లో హాట్ టాపీక్ గా మారింది. సడన్ గా శ్రీనివాస్... కాజల్ కి  ఆఫర్స్ మిద ఆఫర్స్ ఇవ్వడానికి  రీజన్ ఏంటి?.ఇంటర్నల్ గా వినిపిస్తున్నటాక్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

                  టాలీవుడ్ లో  బెలంకొండ శ్రీనివాస్ , కాజల్  కాంబినేషన్ లో తెరకెక్కిన కవచం సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. దీంతోపాటు తేజ దర్శకత్వంలో వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఇప్పడీ రెండు సినిమాలతో పాటు కాజల్-బెల్లంకొండ కాంబోలో ముచ్చటగా మూడో సినిమా కూడా రాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ బయటపెట్టింది."సాయి శ్రీనివాస్ తో ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. అతడితో వర్క్ చేయడం అంత కంఫర్టబుల్ గా ఉంటుంది. నేను, సాయిశ్రీనివాస్ ఒకేలా ఆలోచిస్తాం. మా ఇద్దరి మైండ్ సెట్ ఒకేలా ఉంటుంది అంటూ కొత్త విషయాలు చెప్పుకొచ్చింది.

                నిజానికి కవచం చిత్రంలో కాజల్‌ పేరుని శ్రీనివాస్‌ సిఫార్సు చేయగా, అంత ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ కాకపోయినా కాజల్‌ చేసేసిందని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ఆమధ్య కాజల్‌ని తన భుజాలపై ఎక్కించుకుని శ్రీనివాస్‌ దిగిన ఫోటో వైరల్‌ అయింది. తాజాగా వీరిద్దరి స్టేట్‌మెంట్స్‌తో ఈ రిలేషన్‌ గాసిప్‌ సర్కిల్స్‌ని యమగా ఆకర్షిస్తోంది.ఈ ఇద్దరి మధ్య ఇంటర్నల్ గా ఎదో జరుగుతుంది అనే టాక్ ఫీల్మ్ నగర్ లో గట్టిగా వినిపిస్తోంది.

                మొత్తనికి తన సినిమాలు ఎలా ఉన్న స్టార్ హీరోయిన్లను మాత్రం మిస్ చేసుకోడు బెల్లంకొండ. ఒకట్రెండు సినిమాలు మినహాయిస్తే, కెరీర్ స్టార్టింగ్ నుంచి ఈ హీరోది ఇదే ఫార్ములా. అదే పద్ధతిలో ఇప్పుడు కాజల్ ను వరుసగా మూడోసారి రిపీట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని, అగ్రిమెంట్లు పూర్తయిన తర్వాత ఆవివరాలు చెబుతానంటోంది కాజల్.మరి ఓకే హీరోతో 3 సినిమాలు చేయడానికి కాజల్ ఓకే చేయడం ఏమిటో...కుర్రకుట్టిస్ చాలా మంది ఉన్న ఏజ్ బార్ స్టేజ్ కి చెరిన కాజల్ నే  శ్రీనివాస్ ఏరికొరి  వరుస ఆఫర్స్ ఇవ్వడం ఏమిటో...ఈ తతగం అంతటికి  రీజన్ ఏంటో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వైయిట్ చేయల్సిందే.

Kajal Agarwal
Bellamkonda Sai Srinivas
kajal agarwal News
kajal agarwal Breakings
kajal agarwal Breaking Updates
Kajal Agarwal Latests
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Why Kajal Getting Multiple Offers

YOU MAY LIKE