శర్వా ఇలా ట్రాక్ మార్చడానికి రీజన్ ఏంటి?

Submitted by ganesh on Mon, 11/05/2018 - 14:22
శర్వా ఇలా ట్రాక్ మార్చడానికి రీజన్ ఏంటి?

                     శర్వనంద్...టాలీవుడ్ లో పుల్ జోష్ లో ఉన్న హీరో.మొన్న మహానుభావిడిగా వస్తే...బాక్సాఫీస్ ని షెక్ అయింది.వరుస గా ముడు హిట్స్ ఎకౌంట్ లో పడ్డ పరిస్దితి కనిపించింది. అందుకే ఇప్పుడు పడి పడిలేచే మనసు అంటూ లవ్ లో ఉన్న సరికొత్త ఫీల్ ని చూపించబోతున్నాడు.డిసెంబర్ దరువులో సరికొత్త బరుపు పెంచబోతున్నాడు.ఇంత వరకు ఓకే...కాని శర్వా ఇప్పుడు ఓ తమిళ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చడనే టాక్ ఊపందుకుంది.ఇంతకి ఇందులో నిజమేంత?.సడన్ గా శర్వా ఇలా ట్రాక్ మార్చడానికి రీజన్ ఏంటి?.ఇప్పుడు చూద్దాం.

                    ప్రజంట్ టాలీవుడ్ లో  తమిళ డైరెక్టర్స్  పేరెత్తితే చాలు మన హీరోలు ఆమడ దూరం పారిపోతున్నారు. కారణం అందరికీ తెలిసిందే.  తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాలు తీయలేక చతికిలబడడమే.  దీంతో పాటు తమిళ పైత్యాన్ని రుద్దడానికి ట్రై చేస్తుండడంతో ఆడియన్స్ వాళ్ళ సినిమాలకు కనెక్ట్ కావడంలేదు. ఏదో ఒకరిద్దరు దర్శకులు తప్ప దాదాపు  తమిళ దర్శకులందరిదీ ఇదే తంతు.  కానీ యంగ్ హీరో శర్వానంద్ ఇవేమి పట్టించుకోకుండా రీసెంట్ గా ఒక తమిళ దర్శకుడికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.2019లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లుతుందని టాక్.

                     తమిళంలో ఇప్పటికే నాలుగు సినిమాలు డైరెక్ట్ చేసిన ఆ దర్శకుడి పేరు తిరు.  అందులో రెండు సినిమాల్లో విశాల్ నటించాడు.  'వాడు-వీడు'.. 'ఇంద్రుడు' గా ఆ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి.  రెండూ కూడా డిఫరెంట్ పాయింట్స్ తో తెరకెక్కిన సినిమాలే.   మరి అలాంటి ఇంట్రెస్టింగ్ కథతో మెప్పించాడో ఏమోగానీ శర్వానంద్ మాత్రం తిరుపై నమ్మకం ఉంచాడు.  ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించేందుకు ముందుకు వచ్చాడట.

                       మొత్తనికి శర్వానంద్ ప్రజంట్ హను రాఘవపూడి దర్శకత్వంలో 'పడిపడి లేచే మనసు' సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా తర్వాత డైరెక్టర్ సుధీర్ వర్మతో మరో సినిమా లైన్లో ఉంది.  ఈ రెండు సినిమాల తర్వాత డైరెక్టర్ తిరు సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం.  మరి మిగతా తమిళ డైరెక్టర్లు షాకిచ్చినట్టు కాకుండా ఈ తిరు అయిన తెలుగు హీరోకు ఓ హిట్టిస్తాడో లేదో వేచి చూడాలి.

Sharwanand
Sharwanand News
Sharwanand Breakings
Sharwanand Breaking News
Sharwanand Breaking Updates
Sharwanand Update News
Sharwanand News Updates
Sharwanand Latest Movies
AP24x7
AP24x7 news
AP24x7 Breakings
ap24x7 breaking news
Why Sharwanand changed Track

YOU MAY LIKE