తిప్పేసిన జడేజా

Submitted by venkateshgullapally on Thu, 11/01/2018 - 15:57
తిప్పేసిన జడేజా

5 వన్డేల సీరీస్ లో భాగంగా విండీస్ తో జరుగుతున్న చివరిదైన 5వ వన్డేలో భారత బౌలర్లు రెచ్చిపోయారు. తొలుత బ్యాటింగ్ కి దిగిన విండీస్ ని 104 పరుగులకే ఆల్ అవుట్ చేసారు. తొలి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భువనేశ్వర్‌ వేసిన తొలి ఓవర్‌ నాలుగో బంతికి ఓపెనర్‌ కీరెన్‌ పావెల్‌ పరుగులేమీ చేయకుండానే వెనుతిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన హోప్‌ రెండో ఓవర్‌లో బుమ్రా వేసిన నాలుగో బంతికి డకౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత రోమన్‌ పావెల్‌ (16)ను ఖలీల్‌ ఔట్‌ చేసాడు. రవీంద్ర జడేజా మార్లోన్‌ శామ్యూల్స్‌ (24), షిమ్రన్‌ హెట్‌మైయిర్‌ (9)ని అవుట్ చేసాడు. జేసన్‌ హోల్డర్‌ (5) ని ఖలీల్ అవుట్ చేయగా ఫాబియాన్‌ అలెన్‌ ని (4) బుమ్రా వెనక్కి పంపాడు. కీమో పావెల్ ని కులదీప్ వెనక్కి పంపగా కీమార్ రోచ్ ని జడేజా అవుట్ చేసాడు. ఆ తర్వాత ఓషన్ థామస్ ని కూడా జడేజానే అవుట్ చేసాడు. భారత బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు తీసుకోగా బుమ్రా, ఖలీల్ తలో రెండు వికెట్లు, భువి, కులదీప్ చెరొక వికెట్ తీసుకున్నారు. కాగా ఈ మ్యాచ్ లో ముగ్గురు విండీస్ బ్యాట్స్ మెన్ డకౌట్ కాగా కెప్టెన్ హోల్డర్ 25 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు.

team india
shikhar dhawan
Ravindra Jadeja
windies all out

YOU MAY LIKE