బాలిక నోట్లో బాంబు పేల్చిన యువకుడు

Submitted by Likhitha on Thu, 11/08/2018 - 14:35
బాలిక నోట్లో బాంబు పేల్చిన యువకుడు

                    దీపావళి పండుగ సంబరాల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. మిలాక్ గ్రామానికి చెందిన శశికుమార్‌ కుమార్తె, మూడేళ్ల చిన్నారి అయేషా దీపావళి సందర్భంగా ఇంటి బయట ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన హరిపాల్‌ అనే యువకుడు ఆ సమయంలో బాణసంచా పేల్చడం చూసి చిన్నారి అక్కడికి వెళ్ళింది. దీంతో హరిపాల్‌ అత్యుత్సాహం ప్రదర్శించి బాంబు నోట్లో పెట్టుకుంటే పటాకులు కొనిస్తానని చిన్నారికి ఆశ చూపి ఆమె నోట్లో సుత్లీ బాంబు పెట్టి పేల్చాడు. అది గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. నోరు, గొంతు భాగం తీవ్రంగా దెబ్బతిన్నాయని 50 కుట్లు వేశామని వైద్యులు తెలిపారు. చిన్నారికి చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిందితుడు హరిపాల్‌ పరారీలో ఉన్నాడు. బాలిక తండ్రి సుశిల్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

Uttarpradesh
Milak village
Diwali Celebrations
Diwali Cracker
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
Youth Sets off Diwali Cracker in 3-Year-Old’s Mouth

YOU MAY LIKE