యువరాజ్ వరల్డ్ కప్ ఆడే అవకాశాలు

Submitted by venkateshgullapally on Sat, 10/27/2018 - 18:34
యువరాజ్ వరల్డ్ కప్ ఆడే అవకాశాలు

ఒకప్పటి టీం ఇండియా స్టార్ హిట్టర్ యువరాజ్ సింగ్ వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉందా..? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. గత కొంత కాలంగా టీం కి దూరంగా ఉన్న యువరాజ్ సింగ్ ప్రపంచకప్ లో ఆడటానికి గాను తీవ్రంగా కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొంటున్నాడు. ఇంగ్లాండ్ పిచ్ లపై మంచి అనుభవం ఉండటంతో  ప్రపంచకప్ కి యువరాజ్ ని సిద్దం చేస్తున్నారని క్రీడా వర్గాలు అంటున్నాయి. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతా లేకపోయినా ధోని సహా కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తూ వస్తున్న బోర్డ్ యువిని కూడా అదే ఉద్దేశంతో ఆపుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 2011 ప్రపంచకప్ తర్వాత యువరాజ్ సింగ్ క్రికెట్ ఆడింది చాలా తక్కువ దేశవాళి మ్యాచుల్లో ఆడినా జాతీయ జట్టులోకి రావడానికి మాత్రం నానా అవస్తలుపడుతున్నాడు. మరి వచ్చే ఏడాది ప్రపంచకప్ కి అడతాడో లేదో అనేది తెలియాల్సి ఉంది.

yuvraj sing
team india
world cup
yuvraj sing playing next world cup

YOU MAY LIKE