కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల జాబితా ఖరారు అయిందా..?

Submitted by ganesh on Fri, 11/09/2018 - 14:14
కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల జాబితా ఖరారు అయిందా..?

                    కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల జాబితా ఆల్ మోస్ట్ ఫైనలయ్యింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ, బోధన్ నుంచి సుదర్శన్ రెడ్డి పేర్లు దాదాపు ఖరారైనట్టుగానే కనిపిస్తోంది. అయితే మిగతా ఐదు స్థానాల్లో ఎవరికి ఛాన్స్ దక్కుతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లిస్ట్ కూడా రానుండడంతో ఇటు ఆశావహులతో పాటు అటు జిల్లా నేతల్లోనూ ఉత్కంఠ పెరుగుతోంది.

                       ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టికెట్లు ఎవరికి  దక్కుతాయన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. స్క్రీనింగ్ కమిటీ కసరత్తు పూర్తైనా ఇంకా జాబితా అధికారికంగా వెలువడకపోడవంతో ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో సామాజిక వర్గాల వారీగా అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ నేతలు కసరత్తు పూర్తిచేసి హైకమాండ్ కి లిస్ట్ పంపించారు. ఈమేరకే ఎంపిక ఉంటుందని బలంగా వినిపిస్తున్న టాక్.. ఇక జిల్లాలో సమీకరణాలు బలాబాలను చూస్తే మున్నూర్ ప్రాంతంలో కాపుల ప్రభావం అధికంగా ఉండటంతో అర్మూర్, బాన్స్ వాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో.. ఇదే సామాజిక వర్గానికి చెందిన నేతలు టికెట్ రేసులో ముందున్నారు. ఎల్లారెడ్డి, రూరల్ రెండు నియోజకవర్గాలకు పోటీ తీవ్రంగా ఉంది. నల్లమడుగు సురేందర్, సుభాష్ రెడ్డితో పాటు ఎర్రబెల్లి దయాకరరావు అల్లుడు, కాంగ్రెస్ ఐటీ సెల్ ఛైర్మన్ గా ఉన్న మదన్మోహన్ రావు పేరు కూడా పరిశీలనకు రావడంతో ఈ సీటుపై ఆసక్తి నెలకొంది.

                            ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత పేరు దాదాపు ఖరారు అయినట్టేనని ప్రచారం జరుగుతోంది. జుక్కల్ ఎస్సీ రిజర్వ్డ్ స్ధానం నుండి మాజీ ఎమ్మెల్యేలు గంగారాం, అరుణతార రేస్ లో ఉన్నారు. వీరిలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా.. మరొకరు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. బాన్సువాడ నియోజకవర్గంలో కాసుల బాలరాజు, మాల్యాద్రి రెడ్డి పోటీ పడుతుండగా... కాసుల బాలరాజు పేరు దాదాపు ఖరారు అయినట్లు సమాచారం.  నిజామాబాద్ అర్బనుంచి మహేష్ కుమార్ గౌడ్ తో పాటు డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హండాన్ పేర్లను హైకమాండ్ పరిశీలిస్తుండగా.. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన రేవంత్ బ్యాచ్ కి  చెందిన మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.

                              నిజామాబాద్ రూరల్ నుంచి మహాకూటమి తరపున టీడీపీ కానీ, టీజేఎస్ కానీ సీటు ఇవ్వాలని కోరుతున్నాయి. పొత్తులో భాగంగా బాల్కొండను భాగస్వామ్య పక్షాలకు ఇస్తారా లేక కాంగ్రెస్ పోటీ చేస్తుందా అనేది తేలాల్సి ఉంది. టీడీపీ నుండి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ తనయుడు ఏలేటి మల్లికార్జునరెడ్డి రేసులో ఉన్నారు. టీజేఎస్ పార్టీ ఎల్లారెడ్డి, నిజామాబాద్ అర్బన్ సీట్లు ఆశిస్తుండగా.. టీడీపీ బాల్కొండ, నిజామాబాద్ రూరల్ సీటు కోసం డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ లిస్ట్ ఫైనల్ చేయడంతో జిల్లానేతలంతా ఢిల్లీ వైపు చూస్తున్నారు. హైకమాండ్ పిలుపు ఆపై బీఫామ్ తో ప్రచారపర్వంలోకి దూకేయొచ్చని ప్లాన్లు వేసుకుంటున్నారు.

CONGRESS Leaders
CONGRESS leaders Fire
CONGRESS Leaders Comments
CONGRESS leaders Sensational Comments
CONGRESS Leaders Fires
CONGRESS Leaders Start Devlopment Works
Intintiki CONGRESS
Congress
CONGRESS Updates
CONGRESS Latest updates
CONGRESS Tour
CONGRESS Press Meet
CONGRESS News
CONGRESS Latest News
CONGRESS Latest updates
CONGRESS Announcement
CONGRESS Padayatra
CONGRESS Fires
CONGRESS Comments
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Did Congress Candidates Final List Completed

YOU MAY LIKE