మహాకూటమి పార్టీల మధ్య విబేధాలు

Submitted by ganesh on Fri, 11/09/2018 - 13:58
మహాకూటమి పార్టీల మధ్య విబేధాలు

                        మహాకూటమిలో రేగుతున్న అభిప్రాయబేధాలను క్యాష్ చేసుకునేందుకు మిగిలిన పార్టీలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. మహాకూటమి సీట్ల పంపకాలు పూర్తయితే అసంతృప్తులను తమవైపు లాక్కునేందుకు టీఆర్ఎశ్, బీజేపీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ నేప‌ధ్యంలో కాంగ్రెస్  స్క్రీనింగ్‌ కమిటీలో ఖరారు కాని 15 స్థానాలకు చెందిన అభ్యర్థులను ఢిల్లీకి రావాల్సిందిగా పిలుపు నివ్వ‌డంతో అసమ్మతి నేతలు ఎటువైపు వెళ్తారు అనేదానిపై ఆస‌క్తి నెల‌కొంది.
 

                          సీట్ల పంపకాలు, నియోజకవర్గాల కేటాయింపుల నేపథ్యంలో మహాకూటమి పార్టీల మధ్య విబేధాలు తలెత్తుతున్నాయి. దీంతో ఆశావాహుల టికెట్ ఆశలకు గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. టికెట్ రానివారు అసమ్మతితో ఆయా పార్టీలపై తిరుగుబావుటా ఎగరేసే అవకాశాలున్నాయి. ఇదే  అసమ్మతిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీ యత్నిస్తున్నాయి. కూటమిలో తమకు కావాల్సిన సీట్ల కోసం పట్టుబడుతున్న సీపీఐ.. దీంతో కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాలను సీపీఐకి వదులుకోవాల్సి వస్తోంది. దీంతో సొంతపార్టీలోనే వ్యతిరేకత తప్పనిసరిగా మారింది. పైగా శేరిలింగంపల్లి టికెట్ విషయంలో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ ఏకంగా గాంధీ భవన్ వద్ద ఆందోళనకు దిగారు. ఇదే స్థానం కోసం టీడీపీలోనూ అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. మరోవైపు ఇప్పటికే మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ 15 స్థానాలను మాత్రం పెండింగ్ లో పెట్టింది. ఈ 15 స్థానాల నుంచి టికెట్లు ఆశిస్తున్నవారిని ఢిల్లీ రావాల్సిందిగా పిలుపు రావడంతో.. అధిష్టానంతో చర్చల అనంతరం వారంతా ఎలా స్పందిస్తారు అనేదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.

                         మరోవైపు టికెట్లు రాని వలస నేతలను ఆకట్టుకునేందుకు  టీఆర్ఎల్, బీజేపీలు సిద్ధంగా ఉన్నాయి. ఈ విషయంలో బీజేపీ నేతలు కాస్త ముందున్నట్లు తెలుస్తోంది. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు జాబితా ప్రకటన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవడం ఖాయమని లక్ష్మణ్ జోస్యం చెప్పారు.

                        మరోవైపు కాంగ్రెస్ ను మహాకూటమిని ఎలా దెబ్బకొట్టాలా అని చూస్తున్న టీఆర్ఎస్.. సీట్ల పంపకాలు, జాభితా ప్రకటన కోసం ఎదురుచూస్తోంది. ఆశావాహులను కారెక్కించుకోవాలని ముఖ్యనేతలకు ఆదేశాలు వెళ్లిపోయాయి. సొంతనేతల ప్రచారంతో పాటు అసంతృప్తులనూ రంగంలోకి దించి కూటమిని టార్గెట్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

                             మ‌రో వైపు మహాకూటమిలో బుజ్జగింపుల పర్వం మొదలైంది ఈ నేప‌ధ్యంలో కాంగ్రెస్‌ ముఖ్యనేతలు డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, దామోదర రాజనర్సింహ,కోమటి రెడ్,డి రాజగోపాల్‌ రెడ్డిలకు కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. స్క్రీనింగ్‌ కమిటీలో ఖరారు కాని 15 స్థానాలకు చెందిన అభ్యర్థులను ఢిల్లీకి పిలిపించుకొని వారితో చర్చిస్తోంది. బుజ్జగింపుల్లో భాగంగానే అశావాహులతో కాంగ్రెస్ అధిష్టానం స్వయంగా మాట్లాడుతోంది. కాంగ్రెస్ స్క్రీనింగ్‌ కమిటీలో సీట్లు ఖ‌రారు కాని నియోజ‌క వ‌ర్గాలు సూర్యాపేట, ములుగు, ఇబ్రహీంపట్నం, ధర్మపురి, స్టేషన్‌ ఘన్‌పూర్‌, తుంగతుర్తి, రాజేంద్రనగర్‌, దుబ్బాక, మెదక్‌, పెద్దపల్లి, కోరుట్ల, వరంగల్‌ ఈస్ట్‌, కొత్తగూడెం, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, మేడ్చల్‌, పటాన్‌చెరువు, జుక్కల్‌ స్థానాలకు చెందిన ఆశావహులతో చర్చలు జరుగుతున్నాయి.

                                   అసలే ప్రచారంలో వెనకబడుతున్న కూటమి పార్టీలకు అసంతృప్తుల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదురవుతుందో వేచి చూడాలి.

Congress
CONGRESS News
Congress Breakings
Congress breaking news
tdp
TDP Breakings
tdp breaking news
TJS
TJS Updates
TJS Update News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Differences Between Political Parties

YOU MAY LIKE