ఆడియాన్స్ కి కిత కితలు పెడుతున్న సంపూర్ణేష్

Submitted by ganesh on Fri, 12/07/2018 - 16:23
ఆడియాన్స్ కి కిత కితలు పెడుతున్న సంపూర్ణేష్

                   టాలీవుడ్ లో బర్నింగ్ స్టార్ గా ఎంట్రి  ఇచ్చి ఫస్ట్ మూవితోనే బెస్ట్ కామెడి హీరోగా పేరుతెచ్చుకున్నాడు సంపూర్ణేష్ బాబు.తర్వాత  సింగం123 ,వైరస్ అంటూ  రెండు మూడు సినిమాలు చేసి ఆడియాన్స్ కి కిత కితలు పెట్టాడు. ఇంత వరకు ఓకే...కాని అప్పుడెప్పుడో రెడి చేసిన కొబ్బరి మట్టని మాత్రం ఇప్పటి వరకు రిలీజ్ చేయలేకపోయాడు సంపూ.అసాలు ఆ సినిమా గురించి చిన్న అప్ డేట్ కూడా ఇవ్వడం లేదు.అంటే ఈ సినిమా లాబ్ కే పరిమితమైపోయిందా?.ఇంటర్నల్ గా వినిపిస్తున్న టాక్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

                 టాలివుడ్ లో తనకు తాను బర్నింగ్ స్టార్ అనే బిరుదు ఇచ్చుకుని.. తన తొలి సినిమాకు హృదయ కాలేయంఅనే వెరైటీ టైటిల్ పెట్టుకుని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు సంపూర్ణేష్ బాబు. ఆశ్చర్యకరంగా హృదయ కాలేయంప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. దీంతో టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాడు సంపూ. ఆ తర్వాత అతను హీరోగా సింగం 123’.. ‘వైరస్లాంటి కొన్ని సినిమాలేవో చేశాడు కానీ.. అవేవీ అతడికి మంచి ఫలితాన్నివ్వలేదు.తొలి సినిమాతో ఎంత వేగంగా పైకి లేచాడో.. అంతే వేగంగా కింద పడిపోయాడు.

                      ‘హృదయ కాలేయంతీసిన దర్శక నిర్మాత సాయి రాజేష్.. తన ప్రొడక్షన్లో సంపూ హీరోగా కొబ్బర మట్టఅనే సినిమా మొదలు పెట్టి.. వెరైటీగా ప్రమోట్ చేయడంతో దీనిపై జనాల్లో కొంత ఆసక్తి మొదలైంది జనాల్లో. మొదట్లో హృదయ కాలేయంతరహాలోనే దీన్ని బాగానే జనాల్లోకి తీసుకెళ్లగలిగారు. ఒక దశలో దీనికి మంచి క్రేజ్ కూడా కనిపించింది.అలాంటి టైంలోనే సినిమాను రిలీజ్ చేయగలిగి ఉంటే కథ వేరుగా ఉండేది. కానీ ఏం జరిగిందో ఏమో.. సినిమాకు బ్రేకులు పడ్డాయి. కొన్నాళ్ల తర్వాత అడ్రస్ లేకుండా పోయింది. మళ్లీ మధ్య మధ్యలో సినిమాను బయటికి తీసి హడావుడి చేశారు కానీ.. మళ్లీ కథ మామూలే. రెండు నెలల కిందట సినిమా పూర్తయిందని.. విడుదలకు సిద్ధంగా ఉందని అన్నాడు సాయి రాజేష్. నవంబరు రిలీజ్ అని కూడా ప్రకటించాడు.

                    మొత్తనికి   టాలీవుడ్ లో బర్నింగ్ స్టార్ గా ఫోకస్ అయిన సంపూ ఇప్పుడు బర్న్ అయిపోయాడు.కొబ్బర మట్ట రిలీజ్ కి రెడీ అయినా.. సినిమాను మాత్రం రిలీజ్ చేయలేకపోతున్నాడు. ఇప్పటికే పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడ్డ నేపథ్యంలో జనాలకు ఈ సినిమాపై ఆసక్తి సన్నగిల్లిపోయింది. దింతో ఇప్పుడు ఈ సినిమా పరిస్థితేంటో అర్థం కాని దుస్ధితి. జనాలకు ఆసక్తి ఉన్నపుడు ఈ సినిమాను రెడీ చేసి రిలీజ్ చేయాల్సింది. కానీ మంచి అవకాశాల్ని వృథా చేసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేసిన పెట్టుబడి రాబడిగా మారుతుందా అనేది కూడా డౌటే.మరి ఈ మ్యాటర్ లో ఆ సినిమా టీం ఎలా రియాక్ట్ అవుతుందో వెచి చూడాల్సిందే.

sampoornesh babu
Sampoornesh Babu news
Sampoornesh Babu Breakings
Sampoornesh Babu Breaking News
Sampoornesh Babu Breaking Updates
Sampoornesh Babu Update News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Sampurnesh Babu With Laughing

YOU MAY LIKE