ఆత్మకు జెండర్ ఉంటుందా..?

Submitted by ganesh on Fri, 12/07/2018 - 15:21
ఆత్మకు జెండర్ ఉంటుందా..?

                   తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా, శాస్ర్తోక్తంగా జరుగుతున్నాయి. వాహన సేవలు నయనానందకరంగా సాగుతున్నాయి. రోజూ రెండు వాహన సేవల్లో భక్తులు పాల్గొని తరిస్తున్నారు. నాల్గవ రోజు అమ్మవారు రాజగోపాలుడి అలంకరణలో కల్పవృక్ష వాహనంపై విహరించారు. అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, నిత్య కైంకర్యాలను నిర్వహించారు. అమ్మవారిని సన్నిధి నుంచి వాహన మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. అనంతరం పట్టు పీతాంబరాలు, రత్నకచిత మణిమాణిక్యాలతో రాజగోపాలుడుగా అలంకరించి కల్పవృక్ష వాహనంపై కొలువు దీర్చారు. చిన్నారుల కోలాటాలు, సంప్రదాయ నృత్య కళాకారుల ప్రదర్శనలు, జియ్యర్ల ప్రవచనాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మద్య అమ్మవారు రాజగోపాలుడు అలంకరణలో తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి పద్మావతి అమ్మవారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు హనుమంతుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. హనుమంతుని స్మరిస్తే బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, ఆరోగ్యం సిద్ధిస్తాయిని భక్తుల నమ్మకం. దాస భక్తిని చాటుకునే హనుమంతుడు శ్రీరామునికి బహు విధాలుగా సేవలను అందించే విషయాన్ని వివరిస్తూ సేవ నిర్వహించారు. శ్రీవారిని అర్చించుకనే వివిధ భక్తి మార్గాలను భక్తులకు ఉపదేశించేలా స్వామివారి హనుమంత వాహన సేవ కొనసాగింది. స్వామి వారి వాహన సేవను తిలకించేందుకు తరలివచ్చిన వేలాది మంది భక్తులు పద్మావతమ్మ నామస్మరణ చేశారు. ఈ నామస్మరణలతో తిరుమాఢ వీధులు మారుమోగాయి.

                   తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు ఉదయం పల్లకీ ఉత్సవం వైభవంగా జరగనుంది. అలమేలు మంగమ్మ రోజుకు రెండు వాహనాలపై వివిధ దేవతామూర్తుల రూపాల్లో భక్త జనులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారు మోహినీ అవతారంలో భక్తులకు కనువిందు చేయనున్నారు. మధ్యాహ్నం అమ్మవారికి గంధంతో అభిషేకం నిర్వహించనున్నరు. ఉదయం పల్లకీ ఉత్సవం, సాయంత్రం వసంతోత్సవం, రాత్రి గజవాహనంపై మాఢ వీధుల్లో అమ్మవారు విహరించనున్నారు.

                    పల్లకీ ఉత్సవం గురించిన విశేషాలను తెలుసుకుందాం. ఆత్మకు, పరమాత్మకు స్ర్తీ, పురుష బేధం లేదని చెప్పేదే పల్లకీ ఉత్సవం. దేవుడు స్ర్తీయా, పురుషుడా.. మనలోని ఆత్మ స్ర్తీనా, పురుషుడా..? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేదే పల్లకీ ఉత్సవం. ఆత్మకు జెండర్ లేదు. పూర్వ జన్మలో స్ర్తీగా పుట్టారో..పురుషుడిగా పుట్టారో తెలీదు. ఇప్పుడు పురుషుడిగా ఉన్న వ్యక్తి మరో జన్మలో స్ర్తీగా పుడితే...శరీరంలో మార్పు వస్తుంది తప్ప మరేం జరగదు. ఆత్మకు జెండర్ ఉంటుందా..? ఉండదు..ఈ విషయాన్ని వివరించి చెప్పేదే పల్లకీ ఉత్సవం.

                    ఇక గజ వాహనం యొక్క విశిష్టతను చెప్పుకోవాలంటే.. ప్రకృతి ఆధ్యాత్మిక ప్రగతికి వాహకం మాత్రమే..ప్రకృతి దైవం కాదు అని చెప్పేదే గజ వాహనం. ప్రకృతి దేవుడు కాదు. దైవానికి దగ్గరయ్యేందుకు ఉపయుక్తమయ్యే వాహకం మాత్రమే. ఇది తెలిపేదే గజ వాహనం, ఇదే కీలకమైన వాహనం..పంచభూతాలకు ప్రతీక ఏనుగు. ఏనుగు ఎలా పంచభూతాలకు ప్రతీక అనే సందేహం వస్తోందా? ఏనుగు తొండం వాయువుకు ప్రతీక. మిగిలిన నాలుగు కాళ్లు.. పంచభూతాల్లో మిగిలిన నాలుగు. పంచభూతాలూ ఒక వాహనంగా శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనమిచ్చేదే గజ వాహనం. దైవ గుణాల్లో దేవుడికి నాశనం లేదు అని తెలుసుకున్నాం. మరి శరీరాన్ని ప్రకృతిని దేవుడిగా భావిస్తే శరీరం నాశనం అవుతుంది..దేవుడికి ఆ గుణం ఎలా చెప్పగలం? కాబట్టి అన్ని విధాల ప్రకృతి దేవుడు కాదు.  ఈ విషయాన్ని చెప్పేదే గజవాహనం.

Spirit
Spirit News
Spirit Updates
Spirit News Updates
Spirit Latest news
Spirit Latests
Spirit Latest Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Is there Any Goal For Spirit

YOU MAY LIKE