హీరో గోపిచంద్ ఎక్కడ..?

Submitted by ganesh on Fri, 12/07/2018 - 18:16
హీరో గోపిచంద్ ఎక్కడ..?

                     టాలీవుడ్ లో విలన్ గా ఎంట్రి ఇచ్చి హీరోగా సందడి చేసిన స్టార్ గోపిచంద్.కాని గత కొంతకాలంగా సరైనా హిట్ లేక సతమత మవుతున్నాడు.రిసెంట్ గా వచ్చిన సినిమా హిట్ అయినా తన కటౌట్ అంతగా ఫోకస్ కాలేదు.అందుకే ఇప్పుడు శ్రీవాస్ డైరెక్షన్ లో ఓ కొత్త కథని ట్రైచేయబోతున్నాడు.ఇంత వరకు ఓకే...కాని తమిళ్ మూవి 96లోఈ హీరో నటిస్తున్నాడు అనే టాక్ ఊపందుకుంది.త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయ్.ఇంతకి ఇందులో నిజమేంత?.ఇప్పుడు చూద్దాం.

                     కోలీవుడ్ లో  ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో   త్రిష .. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవి '96'  అక్టోబర్ 4న రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియాన్స్ ని ఫిదా చేయడమే కాదు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. 1996లో జరిగిన ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.ఈ మధ్యన  చెన్నై వెళ్లి స్పెషల్ స్క్రీనింగ్ లో ఈ సినిమాను చూసిన దిల్ రాజు, వెంటనే తెలుగు రీమేక్ రైట్స్ ను కోటి రూపాయలకు కోనేసాడు.దింతో ఈ సినిమాని   తెలుగు నేటివిటికి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేస్తున్నాడట  ప్రేమ్ కుమార్ .

                        96 తెలుగు రీమేక్ లో హీరోగా నటించేది ఎవరు అనేది పెద్ద క్వచ్చిన్ మార్క్ గా మారింది.ముందు నాని అన్నారు. తర్వాత  అల్లు అర్జున్ ని ఈ ప్రాజెక్టులోకి తీసుకువద్దామని దిల్ రాజు చాలా ప్రయత్నం చేసాడు. మొదట ఓకే అనుకున్నా..తర్వాత బన్ని వెనకడుగు వేసాడట. దాంతో  చాలా మంది హీరోలను అనుకుని ఫైనల్ గా గోపిచంద్ దగ్గర ఆగారట.ప్రజంట్ దిల్ రాజు గోపిచంద్ తో డిస్కషన్స్ జరుపుతున్నాడు అని ఇంటర్నల్ టాక్.

                         మొత్తనికి గోపిచంద్ ప్రజంట్ శ్రీవాస్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి  ఒప్పుకున్నాడు. సురేష్ బాబు నిర్మించబోతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కనున్న 96 కూడా ఫైనాల్ అయితే ఈ  రెండు సినిమాలను ఓకెసారి ప్యార్లల్ గా తెరకెక్కించే ఛాన్స్ ఉంది.మొత్తనికి నిన్నటి వరకు సరైనా కథలేక తికమక పడ్డ గోపిచంద్ ఈ రెండు సినిమాల్లో ఏది హిట్ అయిన తన సీన్ మారే ఛాన్స్ ఉంది.తిరిగి ట్రాక్ ఎక్కే అవకాశం కనిపిస్తోంది.అయితే గోపిచంద్ తమిళ్ రీమేక్ ని ఎంత వరకు పైనాల్ చేస్తాడు అనేదే తెలియాల్సి ఉంది.

Gopi
Gopi CHand
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Where Is Gopi chand..?

YOU MAY LIKE