ఏపీ కరోనా వివరాల బులెటిన్ విడుదల..

corona

ఏపీ కరోనా వివరాల బులెటిన్‌‌ను గురువారం ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటి వరకు విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 26,590 మంది వచ్చినట్లు గుర్తించినట్లు తెలిపింది. 25,942 మందిని హోం ఐసోలేషన్‌లో ఉంచామని, కరోనా అనుమానిత లక్షణాలతో 117మందికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 289 మందికి నెగెటివ్, 10 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపింది. 33 మంది శాంపిల్స్‌ నివేదిక రావాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ -19కి అనుమానాల నివృత్తి కోసం 104 నెంబర్‌ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.