రూ.5 లక్షల విరాళం ప్రకటించిన పీవీ సింధు

pv sindhu

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి కష్టకాలంలో సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. మేమున్నామంటూ.. వారికి తోచిన సాయాన్ని అందిస్తున్నారు. కరోనాపై పోరుకు తమవంతు రెండు తెలుగు రాష్ర్టాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది స్టార్‌ షెట్లర్‌ పీవీ సింధు. ఇప్పటికే సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు సినిమా స్టార్లు నితిన్‌ రూ.10 లక్షలు, పవన్‌ కల్యాణ్‌ రూ.2 కోట్లు, దర్శకులు వీవీ వినాయక్‌ రూ.5 లక్షలు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ రూ.10 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.