రూ.70 లక్షల భారీ విరాళం ప్రకటించిన రామ్ చరణ్..

ram charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పెద్ద మనసు చాటుకున్నాడు. కరోనా కోసం పోరాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తనవంతుగా సాయం చేశాడు. రూ. 70 లక్షలు ఆర్థిక సాయం ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని మెగాస్టార్ చిరంజీవి ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌గా, ఇప్పుడు రామ్ చరణ్ @AlwaysRamCharan పేరుతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. మొత్తానికి తన ట్విట్టర్‌లో మొదటి ట్వీట్‌తోనే సంచలనం రేపాడు మెగా పవర్ స్టార్. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. పవన్‌ కల్యాణ్ గారి ట్వీట్‌తో స్ఫూర్తి పొంది కేంద్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రిలీఫ్‌ ఫండ్‌కు మొత్తం కలిపి రూ.70 లక్షలు ప్రకటిస్తున్నాను. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. అందరూ నిబంధనలకు లోబడే ఉండాలని ఒక బాధ్యతగల పౌరుడిగా నేను కోరుతున్నాను' అని ట్వీట్ చేశారు.

మరోవైపు రామ్ చరణ్ చేసిన పనిని పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నాడు. ఈ ట్వీట్‌ని రీట్వీట్ చేసి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ని అభినందించారు.