ఏపీలో 6 నుంచి 9వ తరగతి వరకు పరీక్షల రద్దు..!

adimulapu

కరోనాను కట్టడి చేయడంలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో 6వ తరగతి నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. వారందరీని పై క్లాస్ లకు ప్రమోట్ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని వారి ఇళ్లకే పంపిస్తామని తెలిపారు. మార్చి 31వ తేదీన సమీక్షను నిర్వహించి 10వ తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.