కత్తి మహేష్ కారుపై దాడి..!

Submitted by editor on Fri, 02/14/2020 - 12:15
kathi mahesh

 ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ కారుపై దాడి జరిగింది. హైదరాబాద్‌లోని ఐమాక్స్‌లో సినిమా చూసి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు  శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కత్తి మహేష్ కారుపై దాడి చేశారు. ఈ దాడిలో కారు ముందు భాగంలోని అద్దాలు ధ్వంసమైనట్లు సమాచారం. ఈ దాడి ఘటన పై పోలీసులకు పిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తాము ఈ దాడికి పాల్పడినట్లు భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు వెల్లడించారు. అయితే ఇప్పటికే  హిందువుల మనోభావాలను కత్తి మహేష్  దెబ్బతీశారంటూ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.