ఎలుకకు హుకుం జారీ చేసిన పిల్లి...

Cat and Rat

స్టే హోం..... ప్రధాని నుంచి పోలీస్ కానిస్టేబుల్ వరకు ఎవరు చెప్పినా ఇదే మాట. ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా బయటకు వచ్చే వారికి పోలీసులు తమ స్టైల్లో చెప్పి ఇంటికి పంపిస్తున్నారు. పోలీసులను ఆదర్శంగా తీసుకుందో ఏమో ఓ పిల్లి కూడా స్టే హోం అంటూ ఎలుకకు హుకుం జారీ చేసింది. షూ లో ఉన్న ఎలుక బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంటే.... బయటకు రావదంటూ పిల్లి మొదట మర్యాదగా చెప్పింది. తన మాట వినని ఎలుకని నాలుగు పీకి మరీ లోపల కూర్చోబెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.