పోలీసుపై వాహనదారుల దాడి..

 Lockdown

కరోనా కట్టడికి ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో.. అప్పుడప్పుడూ స్వల్ప లాఠీ చార్జీలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో మాత్రం ఓ హోంగార్డుపై ఇద్దరు వ్యక్తులు చేయి చేసుకున్నారు. కొందుర్గ్ రోడ్డపై వాహనాలు తనిఖీ చేస్తుండగా షాద్ నగర్ నుంచి పరిగి వైపు ఇద్దరు వ్యక్తులు కారులో వెళ్తున్నారు. పోలీసుల తనిఖీల సమయంలో హోం గార్డు పై ఆ ఇద్దరు దాడికి దిగారు. దాడి చేసిన వ్యక్తులు వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన రామకృష్ణారెడ్డి, రాఘవేందర్ రెడ్డిలగా గుర్తించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.