బ్రిట‌న్ యువ‌రాజుకు క‌రోనా

Charles

కరోనా మహమ్మారి  బ్రిటన్‌ రాజ కుటుంబాన్నీ తాకింది. బ్రిట‌న్ యువ‌రాజు చార్లెస్‌కు క‌రోనా సోకినట్లు బ‌కింగ్‌హాన్ ప్యాలెస్ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. చార్లెస్ వ‌య‌సు 71 ఏళ్లు కావ‌టంతో ఆయ‌న ఆరోగ్య ప‌రిస్తితిపై తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. ప్రస్తుతం ప్రిన్స్‌ చార్లెస్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు అక్కడి మీడియా వెల్లడించింది. అయితే, ప్రిన్స్‌ చార్లెస్‌ సతీమణి కామిలియాకు కరోనా నెగిటివ్‌గా తేలింది. ముందస్తుగానే ఆమె క్వారంటైన్‌లోకి వెళ్లారు. చార్లెస్ మార్చి 10న  మొనాకో యువ‌రాజు ఆల్బ‌ర్ట్‌తో స‌మావేశామ‌య్యారు. ఆయ‌న‌కు 5 రోజుల త‌ర్వాత క‌రోనా సోకిన‌ట్లు నిర్దార‌ణ అయ్యింది. బ్రిట‌న్‌లో క‌రోనా వ్యాధితో ఇప్ప‌టికే 422 మంది మ‌ర‌ణించారు.