సోషల్ మీడియాలో దూసుకుపోతున్న మెగాస్టార్..

chiru

మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలోకి మెగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. శ్రీ శార్వరి నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ట్విటర్‌ వేదికగా ఆయన  సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు ఫస్ట్‌ ట్వీట్‌ చేశారు. 'అందరికీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు తెలియచేసారు. ఇదే సమయంలో మరో ట్వీట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న 21 రోజుల లాక్‌డౌన్‌ నిర్ణయాన్ని స్వాగతించడమే కాకుండా.. సమర్థించారు. 

ఇక మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్లోకి అరంగేట్రం చేయడంపై అభిమానులు, సినీ తారలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కేవలం కొద్ది గంటల్లోనే లైకులు, రీట్వీట్లతో మోత మోగించారు. అంతే కాకుండా జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘వెల్‌ కమ్‌ బాసూ’ అంటూ స్పందించగా.. వరుణ్‌ తేజ బిగ్‌ షూటౌట్‌గా, సాయి ధరమ్‌ తేజ ‘వెల్‌కమ్‌ మెగాస్టార్‌ టూఎస్‌ఎం’ అంటూ అభివర్ణించారు. సుహాసిని, రాధికా శరత్ కుమార్, నాగార్జున, మోహన్ లాల్, రాజమౌళి మెగాస్టార్ ను స్వాగతించారు. ప్రస్తుతానికైతే మెగాస్టార్ ఫాలోవర్స్ సంఖ్య నిమిషనిమిషానికి పెరుగుతూనే ఉంది.