కరోనాపై పోరుకు పవన్ కళ్యాణ్ భారీ విరాళం..

pawan kalyan

ప్రముఖ సినీ నటుడు జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కరోనా కారణంగా లాక్‌డౌన్ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు తన వంతు  సాయంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చెరో రూ.50 లక్షల విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అదేవిదంగా ప్రధాన మంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళంగాఅందిస్తున్నట్లు పవన్ తెలిపారు. అలాగే ఇలాంటి విపత్కర సమయంలో ప్రధాని మోదీకి తన మద్దతు ఉంటుందని.. ఆయన నాయకత్వంలో కరోనా ముప్పు నుంచి దేశం సురక్షితంగా బయటపడుతుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.