రైతులు, మహిళలు, యువత కి ఉద్యమ వందనాలు..

amaravathi

జై అమరావతి ఉద్యమం 100 రోజులకు చేరుకున్న నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. జై అమరావతి ఉద్యమం 100 రోజులకు చేరుకుంది. పెయిడ్ ఆర్టిసులు, రైతులు గోచి కట్టుకుని బురదలో ఉండాలి అంటూ అవమానాలు ఒక పక్క... లాఠీ దెబ్బలు, వేల సంఖ్యలో కేసులు, వేల మందిని జైలుకి పంపడం మరో పక్క... అయినా సహనం కోల్పోలేదు. ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు అమరావతిని కాపాడుకోవడానికి వంద రోజులుగా మేము సైతం అంటూ ముందుకు వచ్చిన రైతులు, మహిళలు, యువత కి ఉద్యమ వందనాలు' అంటూ ట్వీట్ చేసారు.