రూ.20 లక్షల విరాళం ప్రకటించిన త్రివిక్రమ్

trivikram

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి కష్టకాలంలో సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. మేమున్నామంటూ.. వారికి తోచిన సాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే హీరో నితిన్, జనసేనాని పవన్ కళ్యాణ్ కరోనాపై పోరుకు తమవంతు విరాళాలను అందించారు. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు చెరో రూ.10 లక్షల విరాళం చొప్పున మొత్తంగా రూ.20 లక్షల ఆర్ధిక సాయం అందజేస్తున్నట్టు ప్రకటించారు.